బాలయ్యతో మొదటిరోజు పనిచేస్తున్నాని తెలియడంతో చాలా నర్వస్ గా ఫీల్ అయ్యాను..!

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా అఖండ, ఈ  సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణా హీరోయిన్ లుగా నటిస్తుండగా, శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ రైతుగా, అఘోర గా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలను, టీజర్, ట్రైలర్, పాటలను, చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాలు నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను మరింతగా పెంచేలా చేస్తాయి. ఇప్పటికే షూటింగ్ మరియు ఇతర పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్ 2వ తేదీన థియేటర్ లలో విడుదల చేయబోతున్నారు.

ఇలా ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో అఖండ చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడు పెంచేసింది, ఈ రోజు భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ను కూడా ఏర్పాటు చేసింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ప్రగ్యా జైస్వాల్ కు చాలా రోజుల తర్వాత వచ్చిన చాలా పెద్ద సినిమా కావడంతో ఈ సినిమాపై ఈ ముద్దు గుమ్మ చాలా ఆశలే పెట్టుకుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక మీడియాతో ముచ్చటించిన ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమా గురించి కొన్ని విషయాలను తెలియజేసింది...
ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ... బాలకృష్ణ గారు చాలా సీనియర్ హీరో. అంత పెద్ద హీరోతో నేను ఇప్పటి వరకు కలిసి నటించలేదు. బాలకృష్ణ ది టైం అండ్ టైం. ఇది వరకు బాలకృష్ణ గారిని రెండు మూడు సార్లు కలిశాను. కానీ ఆయనతో మొదటి రోజు పని చేస్తున్నాను అని తెలియడంతో చాలా నెర్వస్ గా ఫీలయ్యాను. బాలకృష్ణ  లాంటి పాజిటివ్ పర్సన్ ని నేను ఇంత వరకు చూడలేదు. బాలకృష్ణ గారు నడిచి వస్తూ ఉంటే సెట్ అంతా సైలెంట్ అయిపోతుంది. క్రమ శిక్షణ లోనూ సమయ పాలన లోను ఆయన చాలా గ్రేట్. ఆయనతో పని చేయడం చాలా ఆనందంగా ఉంది అని ప్రగ్యా జైస్వాల్ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: