మరో త్రివిక్రమ్ అనే పేరు తెచ్చుకున్న కిషోర్ తిరుమల

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మాటలను బాగా రాసి ప్రేక్షకులను అలరింప చేసే దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు అని చెప్పవచ్చు. ఎక్కువ మంది దర్శకులు హీరోల ఇమేజ్ ను బట్టి పాపులారిటీ నీ బట్టి సినిమా కథలు రాసి హిట్లు కొడుతూ ఉంటారు కానీ కొంత మంది దర్శకులు మాత్రమే తాము రాసిన కథను నమ్మి మాటలను నమ్మి స్క్రీన్ ప్లే ను నమ్మి సినిమాలు చేస్తారు. ఆ విధంగా దర్శకుడు కిషోర్ తిరుమల తెలుగు సినిమా పరిశ్రమలో రచయితగా తన ప్రయాణం మొదలుపెట్టి దర్శకుడిగా ఇప్పుడు ఉన్నత స్థానాన్ని అందుకుంటున్నాడు.

నేను మీకు తెలుసా అనే సినిమాతో రచయితగా తన కెరీర్ ను ప్రారంభించిన కిషోర్ తిరుమల ఆ తరువాత సెకండ్ హ్యాండ్ చిత్రంతో తెలుగులో దర్శకుడిగా మారాడు. ఆ సినిమా యువతకు బాగా నచ్చి ఆయనను దర్శకుడిగా ఒప్పుకునేలా చేసింది. ఆ తర్వాత ఆయన తన దర్శకత్వం ని పక్కన పెట్టి కొన్ని రోజులు రచయిత గా చేశారు. అయితే రామ్ హీరోగా నటించిన నేను శైలజ చిత్రంతో మళ్లీ మెగా ఫోన్ పట్టుకుని సూపర్ హిట్ కొట్టి మంచి రచయిత కలబోసిన దర్శకుడిగా కిషోర్ తిరుమల ఎదిగాడు. 

ఆ సినిమా ఇచ్చిన విజయోత్సాహంతో ఆయన మరొకసారి రామ్ తో ఉన్నది ఒకటే జిందగీ అనే సినిమా చేయగా ఆ చిత్రం కూడా ప్రేక్షకులను బాగా అలరించింది. ఆ తర్వాత రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకుని సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఆయన చిత్రలహరి అనే సినిమా చేశాడు. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. గాడి తప్పుతున్న ఆయన కెరీర్ ను ఈ సినిమా మళ్ళీ లైన్లో పెట్టింది అని చెప్పుకోవచ్చు. ఇక రామ్ తో మూడో చిత్రం గా రెడ్ చేయగా ఆ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.  ఇకపోతే నేను శైలజ సినిమా కి గాను ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా ఆయనకు నంది అవార్డు కూడా వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: