'పవన్ కళ్యాణ్ తో పని చేయడం చాలా ఈజీ'.. కుర్ర డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!!

Anilkumar
'అప్పట్లో ఒకడుండేవాడు' అనే సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకుల్లో మంచి మార్కులు వేసుకున్నాడు యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర.అయితే తన మూడవ సినిమాను ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోతో చేసే అవకాశాన్ని అందుకొని అందరికీ షాకిచ్చాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పను కోషియం అనే సినిమాని తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేస్తున్నాడు సాగర్ కే చంద్ర. దగ్గుబాటి రానా మరో హీరోగా కనిపించనున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ రీమేక్ ఈ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్స్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

 దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తో తన అనుబంధాన్ని ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలియజేసాడు దర్శకుడు సాగర్ కే చంద్ర. ఈ మేరకు ఆ ఇంటర్వ్యూలో సాగర్ మాట్లాడుతూ.." ముందుగా ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వచ్చినప్పుడు కేవలం దగ్గుబాటి రానా మాత్రమే హీరోగా నటిస్తున్నట్లు తెలిసింది. ఆ తర్వాత త్రివిక్రమ్ గారు చెప్పేంతవరకు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న విషయం నాకు తెలీదు.

 ఇక మలయాళంలో ఈ సినిమాలో నటించిన బిజు మీనన్ తో పోల్చుకుంటే పృథ్వీరాజ్ సుకుమారన్ పెద్ద స్టార్ హీరో. కానీ పవన్ కళ్యాణ్ గారు 2 తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరో కంటే ఇంకా ఎక్కువ. అయితే ఆ బ్యాలెన్స్ ని మేము బాగానే మేనేజ్ చేశాం. పవన్ కళ్యాణ్ గారితో తరుచూ ఇంటరాక్ట్ అవుతూ మేము బాగా క్లోజ్ అయిపోయాం. మా ఇద్దరి మధ్య నడిచే టాపిక్ ఎక్కువగా గన్స్ గురించి ఉంటుంది. నాకు, పవన్ కళ్యాణ్ గారికి గన్స్ అంటే చాలా ఇష్టం. దానివల్లే మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యాం. పవన్ కళ్యాణ్ గారు చాలా వెల్ కమింగ్ పర్సన్. పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం చాలా ఈజీ" అంటూ ఆ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసారు దర్శకుడు సాగర్ చంద్ర..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: