'RRR' ట్రైలర్, వరుస ఈవెంట్స్ గురించి హింట్స్ ఇచ్చిన రాజమౌళి..!!

Anilkumar
ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా చిత్రం ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఏడాది జనవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసిన చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు, గ్లిమ్స్ వీడియో సినిమాపై హైప్ ని నెక్స్ట్ లెవల్కి తీసుకెళ్లి పోయాయి. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా విడుదలను రాజమౌళి అదిరిపోయే రేంజ్ లో ప్లాన్ చేశాడు. ఇక త్రిబుల్ ఆర్ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

 ఈ నేపథ్యంలోనే ప్రేక్షకులకు ట్రైలర్ గురించి, సినిమాకి సంబంధించిన మరికొన్ని అప్డేట్స్ గురించి రాజమౌళి పలు హింట్స్ ఇచ్చాడు. తాజాగా ఆర్ ఆర్ ఆర్ సినిమా నుంచి మూడో పాటను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. 'జనని' అంటూ సాగే ఈ పాట రిలీజ్ కి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ఈవెంట్స్ కు సంబంధించిన ప్లాన్స్ గురించి మాట్లాడారు. వచ్చేనెల ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ దాంతో పాటు మల్టిపుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంటాయని చెప్పాడు రాజమౌళి. అంతే కాదు ప్రత్యేకంగా మీడియా వారితో ప్రెస్మీట్ కూడా ఉంటుంది. ఆ ప్రెస్ మీట్ లో హీరో మరియు హీరోయిన్ ల తో పాటు చిత్ర బృందం కూడా పాల్గొంటుంది.

ఆ కార్యక్రమంలో విలేకరులు అడగాలి అనుకున్నా ఏ ప్రశ్నైనా అడగవచ్చు అంటూ రాజమౌళి చెప్పారు. ఇక ఈ ప్రెస్ మీట్లో జనని సాంగ్ ని విలేకర్లకు మాత్రమే వినిపించే రాజమౌళి. ఇక రేపు ఈ పాటను ప్రేక్షకుల కోసం విడుదల చేయనున్నారు. ఇక సినిమా సోల్ మొత్తాన్ని తెలియజేసే విధంగా ఈ పాట ఉంటుందని రాజమౌళి ఈ ప్రెస్ మీట్ లో చెప్పారు. చాలా ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ గా ఈ పాటను కీరవాణి గారు స్వరపరిచారని రాజమౌళి చెప్పడంతో ఈ పాట కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించనున్నారు. అజయ్ దేవగన్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: