టాలీవుడ్ లో సింగర్ తండ్రి అనుమానస్పదలో మృతి..!

Divya
తెలుగు సినిమా పరిశ్రమలో ఉండేటువంటి సింగర్ హరిణి ఇంట్లో ఒక విషాదం చోటు చేసుకున్నది. గత వారం రోజుల నుంచి ఈమె ఫ్యామిలీ కనిపించకుండా వెళ్లిపోయినట్లు సమాచారం. ఇక ఇదే నేపథ్యంలోనే తన ఇంట్లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు దుమారం రేపుతోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఒక్కసారిగా షాక్ తిన్నారు. హరిణి తండ్రి ఒక రైల్వే ప్లాట్ ఫారం మీద మృత దేహం గా కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు.
హరిణి  తండ్రి AK రావ్ సుజన్ ఫౌండేషన్ లో ఒక సీఈఓ గా చేస్తున్నారు. దీంతో వీరి కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు, వెతుకుతున్నారా లేదా ఈయనది ఆత్మహత్య అనే విషయం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హరిణి ఫ్యామిలీ అంత కలసి శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. జరిగిన గత వారం నుంచి మీ ఫ్యామిలీ అంతా కనపడకుండా పోయారట. కాని తన తండ్రి మరణవార్త తెలియడంతో ఒక్కసారిగా వీరు తన తండ్రి మరణించిన ప్రదేశానికి హుటాహుటిగా తరలివచ్చారు. అయితే ఆయన మరణంపై కొన్ని భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
హరిణి తండ్రి AK రావ్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.AK రావ్ మరణించేటప్పుడు ఒక సూసైడ్ నోట్ రాసి మరణించడంతో ఈ కేసు మరింత బలంగా మారుతోంది. ఒక బడా వ్యాపారవేత్త తనను మోసం చేశారని, ఆ ఈ విషయాన్ని కోరమంగళంలో ఉండేటువంటి పోలీస్ స్టేషన్ కి ఒక లెటర్ రాశారు ఈయన.
అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆయన మృతదేహం వద్ద ఒక కత్తి కూడా లభించడంతో ఈ విషయం మరింత కాస్త పెద్దదయింది. అయితే తన దగ్గర  కత్తితో గొంతు కోసుకుని నట్లుగా పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయం కూడా పోస్టుమార్టం లో చేరడం గమనార్హం. తనకు జరిగిన అన్యాయంపై కూడా AK రావ్ తన కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు కూడా తెలుస్తోంది. కోరమంగళం పోలీస్ స్టేషన్కు వచ్చిన లేఖ ఆధారంగా ఈ దర్యాప్తు చేయడం జరిగిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: