'అఖండ' కి ఫస్ట్ అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా..?

Anilkumar
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా నటిస్తున్న చిత్రం అఖండ. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిం చారు. మీరు ఇద్దరు కలిసి ఇంతకుముందు లెజెండ్ సింహా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించారు దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలతో ఉన్నారు. అయితే ఈ సినిమాను డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు చిత్రబృందం.మిర్యాల రవిందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా...ద్వారకా క్రియేషన్స్‌' బ్యానర్ పై తెరకెక్కనుంది. ఐ సినిమాలో హీరోగా బాలకృష్ణ నటిస్తున్నప్పటికీ తనకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జరుగుతుంది.

 అందులో భాగంగా మిర్యాల రవిందర్ రెడ్డి మీడియాతో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు  ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అయితే ఈ విషయానికి వస్తే బాలకృష్ణ నటించిన ఈ సినిమాకి అఖండ అనే టైటిల్ ఫిక్స్ చేయకముందు మహర్జాతకుడు అని అనుకున్నారట. అదే క్రమంలో మిర్యాల రవీందర్ రెడ్డి గారు మాట్లాడుతూ... ఎంత పెద్ద స్టార్ హీరో అయిన  స్టార్ డైరెక్టర్ కి అయిన కథే ముందు... పెద్ద పెద్ద హీరోలకు కథ ఎలా ఉన్నా సరే తర్వాత భాగాన్ని వారే మోస్తారు... వారు చేసిన దాన్ని బట్టి వారి అభిమానులు నా సినిమాను హిట్ చేస్తారు... అయితే బాలకృష్ణ  100వ సినిమాని బోయపాటి గారు చేయాలి...

అయితే ఈ సినిమా కథను బోయపాటి లెజెండ్ సినిమా వచ్చిన 2014వ సంవత్సరంలో నే మహార్జాతకుడు సినిమా కథను వినిపించారు అని చెప్పుకొచ్చారు. అయితే బాలకృష్ణ నటించిన ఈ సినిమా టైటిల్ అప్పుడే ఫిక్స్ చేశారట.అయితే బోయపాటి గారు బాలకృష్ణ గారితో ద్వారకా క్రియేషన్స్', రవీందర్ రెడ్డిగారితో చేద్దామని కూడా చెప్పేసారట. సినిమా చూసిన తర్వాత మహా జాతకుడు నుండి 'అఖండ' అని ఎందుకు టైటిల్ మార్చాము అనేది తెలుస్తుంది అని చెప్పారు. అఖండ సినిమాకు ఈ పేరే పర్ఫెక్ట్ గా ఉంటుందని కూడా చెప్పారు. అయితే ఈ సినిమాలో కనిపించనున్న అఘోరాలు  సమాజానికి సంబంధం లేని వ్యక్తులు కాదు.... వారు వ్యక్తుల కన్నా.. దైవం, ప్రకృతి కన్నా ఎక్కువ అని తెలిపారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: