ప్రేమ పాటలకు కేరాఫ్ అడ్రస్ ఆర్.పి. పట్నాయక్..!!

Anilkumar
తెలుగు సినీ పరిశ్రమలో అనతికాలంలోనే అగ్ర సంగీతదర్శకుడిగా ఎదిగారు ఆర్ పి పట్నాయక్ కేవలం సంగీత దర్శకుడిగానే కాకుండా గాయకుడిగా, నటుడిగా, దర్శకుడిగానూ తెలుగు తెరపై తనదైన ముద్ర వేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లోనూ సంగీతదర్శకుడిగా రాణించారు. ఇక ఈయన సంగీతాన్ని ఈయన పాటలను ఇష్టపడని తెలుగు ప్రేక్షకులు ఉండరు. 'గాజువాక పిల్లా మేం గాజులోళ్లం కాదా', 'తూనీగా తూనీగా', 'రాను రానంటూనే చిన్నదో', 'తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా' వంటి విజయవంతమైన పాటలకు బాణీలు అందించి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఆర్.పి.పట్నాయక్. సంగీత దర్శకుడిగా 80కి పైచిలుకు చిత్రాలకు సంగీతాన్ని అందించారు.

 ఇక తన కెరీర్ లో 300కు పైగా ఈ పాటలను కూడా పాడారు. తన సంగీత సారథ్యంలో ఏకంగా 25 మందికి పైగా గాయకులను పరిచయం చేశారు ఆర్ పి పట్నాయక్. ఇప్పటివరకు ఏ సంగీత దర్శకుడు ఇంతమంది గాయకులను పరిచయం చేయలేదు. ఆ ఘనత ఒక్క ఆర్.పి.పట్నాయక్ గారికి దక్కింది. 90 నుంచి 2000 ల కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు ఆర్ పి పట్నాయక్.నిజానికి దర్శకుడు కావాలని సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఆర్.పి.పట్నాయక్, అనుకోని విధంగా సంగీత దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన 'నీకోసం' అనే సినిమాతో స్వరకర్త గా పరిచయమైన ఆయన.. తేజ దర్శకత్వం వహించిన 'చిత్రం'

 సినిమాతో సంగీత దర్శకుడిగా మారి తొలి విజయాన్ని అందుకున్నారు. ఇక ఆ తర్వాత తేజ - ఆర్పీపట్నాయక్ కాంబినేషన్ లో వచ్చిన కొన్ని చిత్రాలు మ్యూజికల్గా కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నువ్వు లేక నేను లేను, మనసంతా నువ్వే, జయం, దిల్, జెమిని, ఆ నలుగురూ, సంబరం వంటి సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్ గా ఆర్.పి.పట్నాయక్ మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి. ఇక ఆ తర్వాత 2004లో నటుడిగా మారి 'శీను వాసంతి లక్ష్మి' సినిమాలో నటించాడు. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా నటుడిగానే నటించాడు. ఇక దర్శకుడిగా మారి 'బ్రోకర్' అనే సినిమాకి ఉత్తమ కథా రచయితగా నంది పురస్కారాన్ని కూడా గెలుచుకున్నాడు. ఇక సంగీత దర్శకుడిగా 'నువ్వు నేను' సినిమాకి ఉత్తమ నంది పురస్కారాన్ని అందుకున్నాడు. మొత్తం మీద తన సంగీతంతో తన గాత్రం తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు ఆర్ పి పట్నాయక్...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: