కప్పట్రాల్ల స్టొరీ మీద వీవీ వినాయక్ ఫోకస్...?

Sahithya
రాయలసీమలో ఫ్యాక్షన్ నేపథ్యం గురించి మన తెలుగులో కొన్ని సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలన్నీ కూడా దాదాపుగా ఎంతో కొంత విజయం సాధించడమే కాకుండా అభిమానులను ఎంతో అలరించాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలకు సంబంధించి కాస్త హీరోలు కూడా చాలా ఆసక్తి కరం గా ఉండటమే కాకుండా దర్శక నిర్మాతలకు అనేక సూచనలు చేస్తూ డైలాగులు పవర్ఫుల్ గా ఉండే విధంగా ప్లాన్ చేసుకునే పరిస్థితి ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం మన తెలుగులో కొన్ని సినిమాలు మళ్లీ ఫ్యాక్షన్ వైపు వస్తున్నాయని ఈ ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమాలు చేయడానికి అగ్ర హీరోలు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.
ఇక ఇప్పుడు వీవీ వినాయక్ ఫ్యాక్షన్ స్టోరీ మీద దృష్టి పెట్టారనే కర్నూలు జిల్లాలో ఒక గ్రామంలో జరిగిన ఫ్యాక్షన్ స్టోరీ మీద ఆయన చాలా సీరియస్ గా దృష్టి సారించారని అంటున్నారు. ఒక సీనియర్ హీరోతో ఈ కథను ఆయన తెరకెక్కించిన అవకాశం ఉండవచ్చని అయితే ఇది ఒక వర్గానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కథ ముందుకు వెళ్లడం లేదని అంటున్నారు. ఇరు వర్గాలను సంతృప్తి పరిచే విధంగా ఈ కథను వినాయక్ రాసుకునే అవకాశం ఉందని కూడా సమాచారం.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఆయన కర్నూలు జిల్లాలోని కప్పట్రాల్ల అనే గ్రామానికి వెళ్ళాడు అని కప్పట్రాల్ల అనే గ్రామంలో ఈ సినిమాకు సంబంధించి ఆయన అక్కడున్న గ్రామస్తులతో మాట్లాడుతున్నారని సమాచారం. అక్కడి గ్రామస్తులు చెప్పిన కథ మాత్రమే కాకుండా కొంత మంది జర్నలిస్టులు కూడా అడిగి ఆయన ఈ స్టోరీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని అలాగే అప్పట్లో పనిచేసిన మాజీ పోలీసు అధికారులతో కూడా ఈ కథను తెలుసుకుని రాస్తున్నారని అంటున్నారు. మరి ఆయన అనుకున్న విధంగా ఈ కథను ముందుకు పడుతుందా లేదా అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: