వర్మ మరో రక్త చరిత్ర ప్లాన్ చేస్తున్నాడా...?

Sahithya
ఇండియన్ సినిమాలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాంగోపాల్ వర్మ చేసే సినిమాలకు సంబంధించి ఆయన అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఉండటమే కాకుండా సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది ఏంటి అనేది ఎంతో శ్రద్ధగా ఎదురుచూస్తూ ఉంటారు. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ రెండు సినిమాలను ప్లాన్ చేస్తుండగా త్వరలోనే ఆయన మరో రక్త చరిత్ర తరహా సినిమాను ప్లాన్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రక్త చరిత్ర సినిమా తరహాలోనే ఒక ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న గ్రామానికి సంబంధించి ఆయన దృష్టి పెట్టే అవకాశం ఉందని అంటున్నారు.
2017లో హత్యకు గురైన ఒక కర్నూలు జిల్లా నాయకుడు కి సంబంధించి ఆయన దృష్టి పెట్టే అవకాశం ఉందని ఆ హత్య పరిణామాలను ఆయన సినిమా రూపంలో తెరకెక్కించే అవకాశం ఉందని ఆ దారుణ హత్యను ఆయన ప్రేక్షకులకు చూపించి అవకాశాలున్నాయని అంటున్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వైసీపీ నాయకులతో మాట్లాడుతున్నారని ఆయన ఈ సినిమాకు నిర్మాణ సారథ్యం వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి కాస్త రాంగోపాల్ వర్మ కర్నూలు జిల్లాలో దాదాపు ఇరవై రోజుల పాటు ఉండే అవకాశం ఉందని కూడా సమాచారం.
ప్రస్తుతం ఆయన కొండా మురళి జీవిత కథను ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తుండగా ఆ తర్వాత అనంతపురం జిల్లాలో ఓ గ్రామంలో జరిగిన సంఘటన ఆధారంగా సినిమాను నిర్మించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం కొండ మురళి జీవిత కథ సినిమాతో ఆయన బిజీగా ఉండగా ఈ సినిమా తర్వాత ఒక తెలుగు హీరో తో కూడా ఓ సినిమా చేసే అవకాశం ఉందని ఒక పెద్ద సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. మరి రాంగోపాల్ వర్మ అనుకున్నది చేస్తారా లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rgv

సంబంధిత వార్తలు: