రష్మి మరో అనసూయ అవుతుందా!!

P.Nishanth Kumar
బుల్లితెరపై గ్లామర్ యాంకర్ లు గా ఒక చరిత్ర సృష్టించారు యాంకర్ అనసూయ మరియు రష్మీ. జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా వీరు రోజు ప్రేక్షకులకు పంచే వినోదం అంతా ఇంతా కాదు. ఒకప్పుడు యాంకర్ లు అంటే కేవలం మాటలు చెప్పడానికి మాత్రమే అనుకునే వారు. కానీ వీరు వచ్చిన తర్వాతనే యాంకర్లు కూడా గ్లామర్ ప్రదర్శించగలరని వారు షో కూడా ఎంతో రసవత్తరంగా ముందుకు తీసుకు వెళ్ళ గలరని నిరూపితం అయింది. ఇక ఇక్కడ వచ్చిన క్రేజ్ తోనే వీరు సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు.

అనసూయ సినిమాల్లో నటిగా చేస్తూ మంచి పేరు దగ్గించుకుం టూ ఉండగా మధ్య మధ్యలో కొన్ని ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తూ గ్లామర్ ఐకాన్ గా నిలిచిపోతుంది. ఇటు రష్మి కూడా సినిమా పరిశ్రమలో నటిగా దూసుకుపోతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఆమె కొన్ని సినిమాల్లో నటించి నటిగా ఎడగగా కొన్ని ఐటెం సాంగ్స్ చేసి తన అందాలతో ప్రేక్షకులను మా య చేసింది. అయితే రష్మీకి తాజాగా ఓ భారీ అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో ఓ ఐటెం సాంగ్ కి గా ను రష్మీ ని సంప్రదించబోతుందట యూనిట్. ఆచార్య సినిమా ను విడుదల చేసే పనిలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి అదే సమయంలో తన ఇతర సినిమాలకు సంబంధించిన షూటింగ్లు కూడా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతు న్న గాడ్ ఫాదర్ సినిమాను శరవేగంగా పూర్తి చేయనున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కు సంబంధించిన పాటల చిత్రీకరణ చేస్తుండగా ఐటెం పాటకు రష్మి ను తీసుకోబోతున్నా రు. మెగాస్టార్ సినిమా ఛాన్స్ రావడంతో సారిగా రష్మి అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తుందని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: