వచ్చే ఏడాది కూడా ఎన్టీఆర్ మహా బిజీ!!

P.Nishanth Kumar
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. రాజమౌళి తో కలిసి ఆయన చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి కాగా ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ పనుల్లో నిమగ్నమై ఉన్నాడు ఎన్టీఆర్. జనవరి 7వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల కాబోతుడడంతో పాన్ ఇండియా స్టార్ గా మొదటి సారి సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. రామ్ చరణ్ కూడా మరో కథానాయకుడిగా ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

ఇక ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో గతంలో జనతా గ్యారేజ్ అనే సినిమా రాగా అది ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా ప్రేక్షకుల నుంచి డిమాండ్ రాగా అది త్వరగా నెరవేరడంతో ఒక్కసారిగా అందరిలో సంతోషం నెలకొంది. దానికి తగ్గట్లుగానే కొరటాల శివ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కంటే అదిరిపోయే విధంగా ఉండాలని చెప్పి ఓ అద్భుతమైన కథను రెడీ చేశాడు. వాస్తవానికి కొరటాల శివ తో కొరటాల శివ సినిమా మొదలు పెట్టాల్సింది కానీ చివరి నిమిషంలో దాన్ని క్యాన్సిల్ చేసుకుని మరి ఎన్టీఆర్ తో సినిమ ను చేస్తున్నాడు. 

అయితే ఈ సినిమాను ఇంకా మొదలు పెట్టనే లేదు ఈ సమయంలోనే ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను ఓకే చేసుకుంటున్నాడు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మొదలుపెట్టనున్నాడు.  ప్రశాంత్ నీల్ ప్రస్తుతం చేస్తున్న సినిమా లకు సంబంధించిన పనులను పూర్తి చేయనున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో చేతులు కలపనున్నాడు. ఏదేమైనా ఎన్టీఆర్ వచ్చే ఏడాది కూడా ఫుల్ బిజీగా ఉండడం ఆయన అభిమానులు ఎంతగానో సంతోషపెడుతుంది. భారీ చిత్రాలు చేస్తూ ఉండటం ఎన్టీఆర్ కు బాగా కలిసివచ్చే అంశం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: