రామ్ చరణ్ రష్యా టూర్...?
వరుస సినిమాలతో దాదాపుగా మూడు నాలుగేళ్ల నుంచి జూనియర్ ఎన్టీఆర్ బిజీగా ఉండటంతో కుటుంబంతో బయటకు వెళ్లే అవకాశం దాదాపుగా దొరకలేదు. అయితే ఇప్పుడు మాత్రం అలా కాకుండా కాస్త జాగ్రత్తగా టైం ప్లాన్ చేసుకుని ఆర్ఆర్ ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాడు అని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి చేస్తున్న సినిమా దాదాపుగా పూర్తి కాగా వచ్చే ఏడాది మరో సినిమాకు ఆయన కొబ్బరికాయ కొట్టే అవకాశం ఉంది.
ఇక ఇది పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ బాటలో రామ్ చరణ్ కూడా నడుస్తున్నాడు అని త్వరలోనే అతను కూడా విదేశాలకు వెళ్లే అవకాశం ఉందని రష్యా పర్యటనకు వెళ్లడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. దాదాపుగా రెండు నెలల పాటు విదేశాల్లో గడిపే అవకాశం ఉందని అక్కడినుంచి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఈ టూర్ తర్వాత రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశం ఉండవచ్చని కూడా టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఏది ఎలా ఉన్నా సరే వీళ్ళిద్దరూ చేస్తున్న సినిమాకు సంబంధించి అభిమానుల్లో ఉన్న ఆసక్తి అంతా ఇంతా కాదు అనే మాట వాస్తవం.