అభిమానులు మెచ్చేలా బాలకృష్ణ కొత్త గెటప్.. మాస్ కా బాప్..

Deekshitha Reddy
బాలయ్య సరికొత్త గెటప్ తో వచ్చేశాడు. మీసం మెలేసి తొడగొట్టి.. మాస్ డైలాగులు చెప్పే బాలకృష్ణ.. అదే మాస్ అవతార్ తో ఆహా లో కనిపించబోతున్నాడు. అవును, ఆహా లో వచ్చే అన్ స్టాపబుల్ కార్యక్రమానికి సంబంధించి తాజాగా ప్రోమో వదిలారు. అసలే సినిమాలకు మొహం వాచిపోయిన ప్రేక్షకులు ఈ ప్రోమోలో బాలకృష్ణను చూసి అదుర్స్ అంటున్నారు. బాలయ్య ఈజ్ బ్యాక్ అని పండగ చేసుకుంటున్నారు.

 
సినిమా ప్రోమోకి ఏమాత్రం తగ్గకుండా అన్ స్టాపబుల్ ప్రోమో ఎడిట్ చేసినట్టు అర్థమవుతోంది. బైక్ పై, కారులో, గుర్రంపై స్వారీ చేస్తూ బాలయ్య ఎంట్రీ అదిరింది. నవంబర్ 4నుంచి ఈ కార్యక్రమం ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ పై ప్రసారం అవుతుంది. ఇప్పటి వరకూ ఓటీటీకోసం ఓ స్టార్ హీరో ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఇదే తొలిసారి. గతంలో రానా, సమంత ఇంటర్యూలు చేసినా అవి పెద్దగా ప్రజాదరణ పొందలేదు. అయితే బాలయ్య ప్రోగ్రామ్ తో ఆహా సబ్ స్క్రైబర్స్ భారీగా పెరుగుతారని అంచనా వేస్తోంది.
సీనియర్ నటీనటులు.. వెండితెరపైనుంచి బుల్లితెరకి, బుల్లితెరపై నుంచి ఓటీటీకి షిఫ్ట్ అవడం మామూలే. అయితే బాలకృష్ణ నేరుగా వెండితెరపైనుంచి ఓటీటీకి షిఫ్ట్ అయ్యారు. అసలు బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ చేస్తారని, ఆయన హోస్ట్ వచ్చే ప్రోగ్రామ్ ఓటీటీలో టెలికాస్ట్ అవుతుందని ఎవరూ అంచనా వేయలేదు. ఇటీవల వరకు ఇదో ఓ రూమర్ అనుకున్నారు. కానీ బాలకృష్ణ నేరుగా రంగంలోకి దిగారు. అయితే ఇదేదో మొక్కుబడిగా కాకుండా పక్కాగా రెడీ అవుతోంది. దీనికి సంబంధించిన ప్రోమో డిజైనింగ్ లోనే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. ట్రైలర్ పార్ట్ అదిరిపోయింది, మరి అసలు సిసలు ఎపిసోడ్ లో ఆ కంటెంట్ ఉంటుందో లేదో చూడాలి. కంటెంట్ పక్కాగా ఉండి, వెరైటీగా ఉంటే మాత్రం మాస్ బాలయ్య ఓటీటీకా బాప్ అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: