నాగార్జున కి అంత తొందర ఎందుకు?

P.Nishanth Kumar
అక్కినేని నాగార్జున ఈ సంవత్సరం తన ఇద్దరు కొడుకుల తో హిట్ లు కొట్టించి మంచి జోష్ లో ఉన్నాడు. లవ్ స్టొరీ తో చైతు హిట్ కొత్తగా, అఖిల్ కూడా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచలర్ సినిమా తో హిట్ లు సంపాదించాడు.  ఇప్పుడు హిట్ కొట్టడం ఆయన వంతు అయింది. ఆయన ప్రస్తుతం సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ అనే చిత్రాన్ని చేస్తున్న నాగార్జున ఆ చిత్రంతో పాటు బంగార్రాజు అనే సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు. వీటిలో ముందుగా బంగార్రాజు సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా ఆయన తనయుడు నాగచైతన్య కూడా మరొక హీరోగా నటిస్తుండటం విశేషం. అంతేకాదు ఈ సినిమాలో నాగచైతన్య సరసన హీరోయిన్ గా నటిస్తుంది ఉప్పెన ఫామ్ కృతి శెట్టి. మంచి తారాగణంతో కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకోగా ఈ సినిమా రిలీజ్ విషయమై నాగార్జున ఆలోచన ఇప్పుడు అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది.

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా నాగార్జున ఈ చిత్రాన్ని కేవలం రెండు నెలల వ్యవధిలోనే పూర్తి చేసి సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నాడు. సంక్రాంతి సీజన్ లో భారీ సినిమాలు ఉన్నా కూడా నాగార్జున అవేవి పట్టించుకోకుండా సంక్రాంతికే తన సినిమాను విడుదల చేయాలని మంకుపట్టు పట్టడం చూస్తుంటే నిజంగానే ఆయన ఆ సినిమాను సంక్రాంతికి పూర్తి చేసి విడుదల చేస్తాడేమో అనిపిస్తుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ కాగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా కూడా అంతటి స్థాయిలో విజయాన్ని అందుకుంటుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: