"బిగ్ బాస్" షణ్ముఖ్ కు సినిమా ఛాన్స్... "ఏంట్రా ఇది షన్నూ" ?

VAMSI
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో అడుగు పెట్టిన షార్ట్ ఫిలిమ్స్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ లో మొదటి వారానికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. మొదటి మూడు నాలుగు వారాలు అలా సరదాగా చాలా సైలెంట్ గా హౌజ్ లో గడిపేశాడు షణ్ముఖ్. అసలు ఇంట్లో షణ్ముఖ్ ఉన్నాడా లేడా అనిపించింది. ఇక నాలుగో వారం నుండి రూటు మార్చాడు మనోడు. సిరి, షన్నులు క్లోజ్ గా ఉండటం వైరల్ అయ్యింది. అంతే కాదు షన్నుకి కూడా కోపం వస్తుందని ఈ మద్యే తెలిసింది. అంతే కాదు జోకులు కూడా బాగా వేస్తున్నాడు. నిజం చెప్పాలంటే షణ్ముఖ్ జస్వంత్ కాస్త సరదాగా మాట్లాడినా చాలా ఫన్నీగా అనిపిస్తుంది తెలియకుండానే నవ్వొస్తుంది. ముఖ్యంగా "ఏంట్రా ఇది" అనే మాట షన్నుకి బాగా క్రేజ్ తెచ్చిపెట్టింది.
నిన్న మొన్నటి వరకు లీస్ట్ లో ఉన్న ఈ సూపర్ డ్యాన్సర్ ఇక పోను పోను టాప్ ఫైవ్ లిస్ట్ లో తప్పకుండా ఉంటాడని అనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇతడి గురించి మరో వార్త సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. ఓ యంగ్ హీరో చిత్రంలో షణ్ముఖ్ జస్వంత్ కి అవకాశం లభించిందని తెలుస్తోంది. ఈ సినిమాలో మంచి కామెడీ యాంగిల్ లో షన్ను కనిపించనున్నాడని టాక్. చాలా సైలెంట్ గా సున్నితంగా జోకులు వేసే షన్ను బాగా నవ్విస్తాడు అనేది బిగ్ బాస్ హౌజ్ లో చూశాం. అయితే ఇపుడు వెండి తెరపై కూడా షన్ను కనిపించబోతున్నారు అంటే అతడి అభిమానులు ఆనందంతో చిందులు వేస్తున్నారు.
అయితే ఈ విషయం పైంపూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.  షార్ట్ ఫిల్మ్స్ తో ఇండస్ట్రీకి పరిచయమయిన షణ్ముఖ్ జస్వంత్ మంచి డ్యాన్సర్ అన్న విషయం కూడా తెలిసిందే. "సాప్ట్ వేర్ డెవలపర్"  అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అంతే కాదు టాలీవుడ్ ప్రముఖ దర్శకులు సైతం ఫోన్ చేసి మరి వెబ్ సిరీస్ చాలా బాగుంది, సూపర్ గా యాక్ట్ చేశారు అంటూ ప్రశంసించారట.  సౌత్ ఇండియాలో పాపులర్ వెబ్ సిరీస్ లో టాప్ 5 లో నిలిచింది "సాప్ట్ వేర్ డెవలపర్" వెబ్ సిరీస్ బహుశా ఇది కూడా ఇపుడు అతడికి అవకాశం రావడానికి ఒక కారణం అయ్యుండొచ్చు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: