బిగ్ బాస్ - 5 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతనే..?

Anilkumar
బిగ్ బాస్ సీజన్ 5 చూస్తుండగానే 50 రోజులు గడిచిపోయింది. ఇక ఏడో వారం పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇటీవల 8వ వారం లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఎనిమిదవ వారానికి గాను ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. ఇక ఈ వారం నామినేషన్ లో యాంకర్ రవి, షణ్ముఖ్ జస్వంత్, లోబో, సిరి, శ్రీ రామచంద్ర, మానస్ ఉన్నారు ఇక వీరిలో ఓటింగ్ పరంగా చూసుకుంటే షణ్ముక్, యాంకర్ రవి అందరికంటే ముందున్నారు. ఈ ఇద్దరికీ ఆడియన్స్ నుంచి భారీగా ఓట్లు పడుతున్నాయి. ఇక ఆ తర్వాత స్థానంలో శ్రీరామచంద్ర,మానస్ ఉన్నారు. సో ఈ నలుగురు ఈ వారం ఖచ్చితంగా సేఫ్ జోన్లో ఉంటారు. 

ఇక డేంజర్ జోన్ లో ఉంది మాత్రం లోబో, మరియు సిరి. ఇక వీరిద్దరిలో డేంజర్ జోన్ లో ఎక్కువగా ఉంది మాత్రం లోబో. ఎందుకంటే గత ఆరు వారాల నుంచి ఏకంగా ఆరుగురు అమ్మాయిలు ఇంటి నుంచి ఎలిమినేట్ బయటకు వెళ్లిపోయారు. దాంతో బిగ్ బాస్ కేవలం అబ్బాయిల కోసమే పెట్టారా అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు అబ్బాయిలు చూసుకుంటే కేవలం నటరాజ మాస్టర్ మాత్రమే ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. కాబట్టి ఈ వారం కూడా అమ్మాయి ఎలిమినేట్ అయితే బిగ్ బాస్ పై మరింత విమర్శలు పెరగడం ఖాయం. అందుకే కచ్చితంగా ఈ వారం అబ్బాయి ఎలిమినేట్ అవుతాడని తెలుస్తోంది.

మరోవైపు ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ లో వీక్ కంటెస్టెంట్ ఎవరు అంటే అది లోబో నే. ఇక సిరి కూడా తనకు ఉన్నంతలో బెస్ట్ ఇస్తుంది. కాబట్టి సిరి ఈ వీక్ లో ఎలిమినేట్ కావడం కష్టమే. ఎలా చూసుకున్నా కూడా ఈ వారం డేంజర్ లో ఉంది మాత్రం లోబో. ఇక పరిస్థితులు కూడా లోబోకి అనుకూలంగానే ఉన్నాయి. ఎందుకంటే సీక్రెట్ రూమ్ లో నుంచి బయటకు రాగానే హౌస్మేట్స్ గురించి మాట్లాడి అందరి దగ్గర బుక్కయ్యాడు లోబో. అప్పట్నుంచి హౌస్ లో టాస్క్ లు జరిగినా సరిగ్గా ఆడటం లేదు. అందుకే ఈ వారం లోబో డేంజర్ జోన్లో కొనసాగుతున్నాడు. కాబట్టి ఈ వారం ఖచ్చితంగా లోబో ఇంటిదారి పట్టనున్నాడనివార్తలు వినిపిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: