మోహన్ బాబు ట్రైన్ లో టీసీని చూసి బాత్రూం లో దాక్కున్నాడట?

VAMSI
ఏళ్ల సినీ ప్రస్థానంలో వందలాది చిత్రాల్లో నటించిన మోహన్ బాబు డైలాగ్స్ చెప్పడంలో దిట్ట. విలన్ పాత్రలు చేసినా ప్రేక్షకులతో విజిల్స్ వేయించుకున్న నటుడు ప్రపంచంలోనే మోహన్ బాబు ఒక్కడే కాబోలు. అంతగా తన విలనిజం తోనూ అలరించారు మోహన్ బాబు. పెదరాయుడు సినిమాతో కలెక్షన్ కింగ్ గా సత్తా చాటిన ఈ సీనియర్ హీరో తన వరుస చిత్రాలతో బాక్స్ ఆఫిస్ ను షేక్ చేశాడు. 2005 వరకు హీరోగా కొనసాగి కాస్త క్రేజ్ తగ్గడంతో సపోర్ట్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టాడు. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అద్భుతమైన నటనతో సినిమాలు సక్సెస్ అవ్వడంలో భాగమయ్యారు అనడంలో అతిశయోక్తి లేదు.
ఇంతటి మహానటుడు, గొప్ప నిర్మాత, కో ఆర్టిస్ట్ అసలు సినీ రంగంలోకి ఎలా వచ్చారో తెలుసా? ఈయనది చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని మోదగులపాలెం అనే ఒక చిన్న గ్రామం. చిన్నతనం నుండే సినిమా అంటే మక్కువ ఎక్కువ, నటించాలంటే మహా ఇష్టం. అయితే  ఓ సారి సినిమా కోసం నటీనటులు కావాలన్న ఒక ప్రకటన చూసి అప్పు చేసి మరీ ఫోటోలు తీసి దరఖాస్తు పంపారట మోహన్ బాబు. రోజులు గడుస్తున్నా ఇండస్ట్రీ నుండి ఎటువంటి స్పందన రాకపోవడం తో ఉండ బట్టలేక నటుడిగా మరాలన్న ఆకాంక్షతో ఇంట్లో చెప్పకుండా చెన్నై వెళ్ళిపోయాడట మోహన్ బాబు.
అయితే అక్కడ భాష పెద్దగా తెలియక, కొత్త చోటు కావడంతో కంగారు పడి తిరిగి ఊరుకు రైలు ఎక్కేసారు.  ఆ సమయంలో ట్రైన్ లో టీసి ను చూసి బాత్రూమ్ లో దాక్కున్నారట మోహన బాబు..ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ షో లో చెప్పారు. అలా ఎన్నో తంటాలు పడి, సమస్యలను అధిగమించి నేడు సినీ చరిత్రలోనే తనకంటూ ప్రతిష్టాత్మక పేజీని లిఖించుకున్నారు డైలాగ్ కింగ్ మోహన్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: