ఫిట్ నెస్ మంత్రం జపిస్తున్న హీరోలు..!

NAGARJUNA NAKKA
మెగా హీరో వరుణ్ తేజ్ ఇప్పటివరకు రెగ్యులర్ లుక్‌లోనే కనిపించాడు. మాస్ రోల్స్‌ చేసినా మజిల్డ్‌ బాడీపై పెద్దగా ఫోకస్ చేయలేదు. అయితే బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోన్న 'గని' కోసం చెమటలు చిందించాడు. జిమ్‌లో గంటలకొద్ది వర్కవుట్లు చేసి కండలు పెంచాడు. అలాగే బాక్సింగ్‌లోనూ ట్రైనింగ్‌ తీసుకున్నాడు వరుణ్. నిఖిల్‌ రెగ్యులర్ లవ్‌స్టోరీస్ పక్కనపెట్టి చాలా కాలమైంది. వైవిధ్యమైన సినిమాలతో కెరీర్‌ని యూనిక్‌గా డిజైన్ చేసుకుంటున్నాడు. అలాగే కటౌట్‌ని కూడా మార్చుకుంటున్నాడు. 'కార్తికేయ2' సినిమా కోసం కంప్లీట్‌గా మారిపోయాడు. బాడీ బిల్డ్‌ చేసి కొత్తగా కనిపిస్తున్నాడు నిఖిల్.
పూరీ జగన్నాథ్ డైలాగులు ఎంత క్యాచీగా రాస్తాడో, హీరోలని అంతే కొత్తగా ప్రజెంట్‌ చేస్తుంటాడు. సిక్స్‌ ప్యాక్, డిఫరెంట్‌ హెయిర్‌స్టైల్‌తో కొత్తగా చూపించే పూరీ ఇప్పుడు విజయ్‌ దేవరకొండని బీస్ట్‌లా మార్చేశాడు. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న 'లైగర్' కోసం బాడీ బిల్డ్ చేశాడు విజయ్. అప్పట్లో హీరోలు చాలా స్పీడ్‌గా సినిమాలు చేసేవాళ్లు. కానీ ఇప్పటి హీరోలు ఏడాదికి ఒకటి రెండు కంటే ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నారు.  దీంతో తక్కువ సినిమాలు చేసినా, ఆడియన్స్‌కి గుర్తుండిపోయే రోల్స్ చేయాలనుకుంటున్నారు.   అందుకే కటౌట్‌ని క్యారెక్టర్‌కి తగ్గట్లుగా మార్చుకుంటున్నారు. 'బాహుబలి' సినిమా కోసం రానా హల్క్‌లా మారిపోయాడు. బాహుబలి కంటే భళ్లాలదేవుడు బలంగా కనిపించాలని జిమ్ లలో గంటల కొద్దీ కష్టపడ్డాడు. అయితే మాహిష్మతి సామ్రాజ్యంలో బీస్ట్‌లా కనిపించిన రానా, నెక్ట్స్‌ సినిమాకే వెయిట్ తగ్గిపోయాడు. ఇక 'అరణ్య' సినిమాలో అయితే మరింత సన్నగా కనిపించాడు.
నాగశౌర్య లవర్‌బాయ్‌ లుక్‌తో ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యాడు. యాక్టింగ్‌తో పాటు స్టోరీ రైటింగ్‌, ప్రొడక్షన్‌లోనూ అడుగుపెట్టిన ఈ హీరో సినిమా సినిమాకి మేకోవర్ అవుతున్నాడు. 'వరుడు కావలెను' సినిమాకి శౌర్య 16 కేజీల వరకు బరువు తగ్గాడు. ఇక 'లక్ష్య' సినిమాకి మజిల్డ్‌ బాడీ బిల్డ్‌ చేశాడు. అఖిల్‌ స్టైలిష్‌ హిట్‌ కోసం చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల 'మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌'తో ఫస్ట్‌ హిట్ కొట్టాడు. ఇక ఈ సినిమా తర్వాత సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్‌'గా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా కోసం గ్రీక్‌ గాడ్‌లా మేకోవర్‌ అయ్యాడు. సిక్స్‌ప్యాక్ పోస్టర్స్‌తోనే అంచనాలు పెంచాడు 'ఏజెంట్'.
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: