బుట్ట బొమ్మను నెట్టనున్న శ్రీ లీల....?

Satya
లక్ ఎపుడూ అలా నడిచే దారిలో ఉంటుందేమో. అందుకే లక్కు ని తొక్కారు అంటారు. అయితే కావాలని తొక్కాలని చూస్తే జారిపడతారు. ఆ టైమ్ కూడా రావాలి. అది జరిగిన నాడు ఏమీ కాకుండానే ఎవరెస్ట్ శిఖరం ఎక్కేస్తారు. టాలీవుడ్ లో ఇపుడు అలాంటి లక్కీ గర్ల్ ఎవరు అంటే కచ్చితంగా శ్రీ లీల అంటున్నారు అంతా.
ఈ అమ్మడి డాక్టర్ చదువుతూ యాక్టర్ అయింది. అందరూ డాక్టర్ కాబోయి యాక్టర్ అంటారు కదా కానీ శ్రీ లీల విషయంలో ఇది నిజం. ఈ బెంగుళూర్ బేబీ పెళ్ళి సందడి అంటూ బాగా సందడి చేసేసింది. ఆ మూవీలో స్పెషల్ అట్రాక్షన్ అంటే శ్రీ లీలగానే చెప్పాలి. గ్లామర్ అలా టన్నుల కొద్దీ ఒలకబోసేసింది. అందం ఎక్కడ ఉంది అంటే లేనిదెక్కడ అన్నట్లుగా శ్రీ లీల సవాల్ చేస్తుంది. ఆమె కళ్ళు చాలా కధలు చెబుతాయి.
ఫస్ట్ మూవీలో ఆమె పెర్ఫార్మెన్స్ తో కూడా అదరగొట్టేసింద్. దాంతో శ్రీ లీలకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని అంతా అనుకున్నారు కానీ ఇలా వెల్లువలా ఆఫర్స్ వస్తాయని అనుకోలేదు. మాస్ మహారాజా రవితేజా పక్కన ఒక మూవీలో చాన్స్ కొట్టేసిన శ్రీ లీల చేతిలో మరిన్ని సినిమాలు ఉన్నాయి. ఇక శ్రీ లీల తెలుగులో సరైన టైమ్ లో ఎంట్రీ ఇచ్చింది అంటున్నారు. టాలీవుడ్ హిట్స్ మీద హిట్స్ ఇస్తూ పూజా హెగ్డేని అందలం ఎక్కిస్తున్నా ఆమె మనసు బాలీవుడ్ మీద ఉంది. దాంతో శ్రీ లీల ఆమెను ఢీ కొట్టడానికి సరైన హీరోయిన్ అన్న మాట వినిపిస్తోంది. మరో రెండు హిట్లు కనుక పడితే మాత్రం శ్రీ లీల టాలీవుడ్ ని ఏలడం ఖాయమే. బుట్ట బొమ్మ పూజా హెగ్డేని అన్నారు. ఇపుడు డాక్టరమ్మ అని వెంట పడతారేమో. ఏమైనా టాలీవుడ్ కి సరి కొత్త గ్లామర్ ఈ అమ్మడు అనాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: