సీరియల్ వాళ్ళందరూ వచ్చేసారు.. ఇక రచ్చ రచ్చే?

praveen
బుల్లితెర  ప్రేక్షకులందరికీ ఎంటర్టైన్మెంట్ పెంచేందుకు ప్రస్తుతం ఈ టీవీ లో ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి అన్న విషయం తెలిసిందే  అయితే అయితే ప్రేక్షకులందరికీ అంతకుమించిన ఎంటర్టైన్మెంట్ పంచేందుకు ఈటీవీ నిర్వాహకులు శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్ ప్రతి సండే ని ఫన్ డే గా బుల్లితెర ప్రేక్షకులందరికీ  మార్చేస్తుంది.  ప్రతివారం సరికొత్త రీతిలో ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సరికొత్త కాన్సెప్ట్ తో ఇక ఈ కార్యక్రమం ప్రేక్షకులకు అంతకుమించిన సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 అయితే ప్రతి వారం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ ఇక ఈ వారం కూడా విభిన్నమైన కాన్సెప్ట్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీదేవి డ్రామా కంపెనీ వనభోజనాలు అంటూ ఒక సరికొత్త ఈవెంట్ ప్లాన్ చేశారు. అయితే ఈసారి మునుపెన్నడూ లేని విధంగా మరింత గ్రాండ్గా నిర్వాహకులు ప్రోగ్రాం ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.  ఈ క్రమంలోనే బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లో ఎమోషన్ పండిస్తూ అందరినీ కన్నీళ్లు పెట్టించే సీరియల్ నటి మణులు అందరూ కూడా ఈ వనభోజనాలు ఈవెంట్ కి వచ్చేశారు.  ఈ క్రమంలోనే ఇక వారందరూ కూడా అదిరిపోయే స్కిట్ లు చేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధమయ్యారు.

 కాగా ఇటీవలే వచ్చే వారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే సీరియల్ సెలబ్రిటీలు అందరూ కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పై తమదైన శైలిలో స్కిట్లు చేశారు..  ఆ తర్వాత ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది ఏకంగా చీరకట్టుకుని స్టేజి మీదికి వచ్చేస్తారు. ఈ క్రమంలోనే అటు సీరియల్ నటి మణులకు హైపర్ ఆది సపోర్ట్ చేస్తే ఆటో రాంప్రసాద్ జబర్దస్త్ వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు.  ఇక మధ్య మధ్యలో అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ లు కూడా ఉన్నాయి అని చెప్పాలి. ఈ ప్రోమో చూస్తుంటే ఈ వారం కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ పక్క అన్నది అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: