అప్పుడే సమంత రెండో పెళ్లి.. ఫుల్ క్లారిటీ వచ్చేసిందిగా..?

VUYYURU SUBHASH
 ఎట్టకేలకు మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ.. అక్కినేని నాగ చైతన్య - సమంత విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యారు. ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట విడాకులు తీసుకుని వేరు వేరు గా తమ జీవితాలను ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధం అయ్యారు. అయితే వీళ్లు విడిపొవడానికి సరైన కారణాలు మాత్రం చెప్పకుండా.. మేము విడిపోతున్నాం..భార్య భర్తలుగా విడిపోయినా..మేం మంచి ఫ్రేండ్స్ గా ఉంటాం.
దయచేసి మాకు కొంచెం ప్రైవసీ ఇవ్వండి అంటూ.. విడిపోతూ కూడా ఒక్కే మేసేజ్ తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసారు. దీంతో విడాకుల వార్త రూమర్స్ అంటూ కొట్టిపడేసిన అక్కినేని అభిమానులకు గుండె ఝల్లుమంది. విడాకుల విషయం ప్రకటించి 20 రోజులు పైనే కావస్తున్నా..ఇంకా ఆ విషయాని జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ల ఫ్యాన్స్. మనసు మార్చుకుని ఇకనైనా కలిసి ఉంటారేమో అని ఆలోచించే అభిమానులు లేకపోనూ లేదు. ఇక ఇలాంటి క్రమంలో తెర పైకి ఓ షాకింగ్ వార్త బయటకు వచ్చింది.
పలు న్యూస్ ఛానల్ లో..యూట్యూబ్ ఛానల్ లో రెండో పెళ్లికి రెడీ అయినా సమంత అంటూ వార్తలు రాసుకొచ్చారు. ఇక సమంత ఇవి ఫేక్ న్యూస్ నమ్మద్దు అంటూ.. తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్లు కూడా పెట్టింది. అబ్బే అయినా ఆ సమంత రెండో పెళ్లి న్యూస్ కి బ్రేక్ పడలేదు కాదు కదా.. సమంత పై ఇంకా లేనిపోనీ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. దీంతో విసుగు చెందిన సమంత డైరెక్ట్ గా కోర్టు ను ఆశ్రయించింది. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ కేస్ వేసింది. సరే..ఇప్పటికైనా అలాంటి వార్తలు ఆపారా..? అంటే అది లేదు. సమంత పై మరిన్ని తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవుతూనే ఉన్నాయి.. మరి ఇలాంటి వార్తలకు ఎప్పుడు బ్రేక్ పడతాయో కూడా తెలియని పరిస్ధితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: