డబ్బింగ్ సినిమాలలోనే చరిత్ర సృష్టించిన సినిమా కబాలి

P.Nishanth Kumar
రజనీకాంత్ హీరోగా యువ దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కబాలి. ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను మాత్రమే కాకుండా యావత్ దక్షిణ భారత దేశాన్ని ఎంతగానో అలరించింది అన్న విషయం అందరికీ తెలిసిందే. రజినీ కాంత్ కు ఉన్న క్రేజ్ కు నిదర్శనంగా ఈ సినిమా కలెక్షన్ ల ను చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ఆ సినిమా అందుకున్న రికార్డులను బట్టి చెప్పవచ్చు. రజినీకాంత్ తొలిసారిగా స్టార్ దర్శకుడితో కాకుండా యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయడం స్పెషల్.

ఈ సినిమా రజినీకాంత్ స్టామినా ను చూపించే విధంగా ఉండడం ఆయనకు ఈ సినిమా స్పెషల్ సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రాధిక ఆప్టే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కథ కూడా రజనీకాంత్ వయసు కు చక్కగా సూట్ అయ్యే విధంగా ఉండటంతో ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది అని చెప్పవచ్చు. 2016 సంవత్సరం లో విడుదలైన ఈ యాక్షన్ క్రైమ్ చిత్రం లో రజిని డాన్ గా నటించగా ఓ గొడవలో కోల్పోయిన తన భార్య పిల్లల్ని చాలా రోజులు జైలు జీవితం గడిపిన తరువాత ఏ విధంగా వారిని దక్కించుకో గలిగాడు అనేదే ఈ సినిమా కథ.

ఈ సినిమా విడుదలైన సమయంలో ఈ చిత్రానికి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. మలేషియా బ్యాంకాక్ హాంకాంగ్ లలో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకోగా గ్యాంగ్ వార్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా తైవాన్ నటుడు వింస్టన్ చావో నటించగా మలేషియాలో జరిగిన చిత్రీకరణకు అవసరమైన విలాసవంతమైన కార్ లను మలేషియా లో ఉన్న రజనీకాంత్ అభిమానులు అందించడం విశేషం. ఆడియో విడుదల రోజున సినిమా పోస్టర్ల తో రోడ్ షో ప్రదర్శించారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ సమయంలో రెండు వందల కోట్ల రూపాయల బిజినెస్ చేసి ఇండియన్ రికార్డులను సృష్టించింది చిత్రం. అంతర్జాతీయంగా 10 వేల థియేటర్లలో ఈ సినిమా విడుదల కాగా చైనాలో మాత్రం 5,000 థియేటర్లలో ప్రదర్శింపబడిన మూడవ భారతీయ చిత్రంగా ఈ సినిమా ప్రత్యేకతను సంతరించుకుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: