చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేసిన అన్నపూర్ణ...?

murali krishna
తెలుగులో సుమారుగా 700కు పైగా సినిమాలలో నటించి పాపులారిటీని సంపాదించుకున్న నటీమణులలో అన్నపూర్ణ ఒకరని అందరికి తెలుసు.. చిన్న వయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అన్నపూర్ణ 73 సంవత్సరాల వయస్సులో కూడా నటిస్తున్నారని తెలుస్తుంది.
అన్నపూర్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను బాబా భక్తురాలినని చెప్పుకొచ్చారని సమాచారం.. తాను చేసిన పొరపాట్ల వల్ల మా ఆయన బాధపడి నట్లు ఇంకెవరూ బాధ పడలేదని అన్నపూర్ణ వెల్లడించారని తెలుస్తుంది.
తనకు ఏడుపు త్వరగా రాదని సినిమాల్లో ఉన్నంత మెత్తగా తాను లైఫ్ లో ఉండనని అన్నపూర్ణ పేర్కొన్నట్లు సమాచారం.. పెద్ద వయస్సులో బుర్ర ఎక్కువగా పని చేయదని అన్నపూర్ణ వెల్లడించారని తెలుస్తుంది. ఏదో అనేస్తాను కానీ తాను కూడా బాధ పడతానని అన్నపూర్ణ పేర్కొన్నారట.మనం పని చేస్తే డబ్బులు వస్తాయని ఏం జరిగినా వెంటనే అడిగేస్తానని అన్నపూర్ణ చెప్పుకొచ్చారని సమాచారం.సురేష్ ప్రొడక్షన్స్ లో తనకు బాగానే ఆఫర్లు వచ్చాయని అన్నపూర్ణ పేర్కొన్నట్లు తెలుస్తుంది.
 
సినీ పరిశ్రమలో తనకు చంద్రమోహన్ మరిది అవుతాడని అలాగే సుత్తివేలు మరియు సత్యనారాయణ బావ అవుతారని అలాగే జగ్గయ్య గారు మామయ్య అవుతారని చెప్పుకొచ్చిందట.ప్రస్తుత స్టార్ హీరోలు తనకు మనవళ్లు అని అన్నపూర్ణ వెల్లడించారని తెలుస్తుంది.. తనకు లైట్ చూసుకోవడం రాదని చిరంజీవి గారు తనను లైట్ చూసుకోవా? అని గట్టిగా అరిచారని అన్నపూర్ణ తెలిపారని తెలుస్తోంది.. చిరంజీవి తన మంచి కోసమే చెప్పారని అన్నపూర్ణ పేర్కొన్నట్లు సమాచారం.బాలకృష్ణను తాను బాలబాబు అని పిలుస్తానని అన్నపూర్ణ వెల్లడించారని సమాచారం. చిరంజీవిని తాను అబ్బాయ్ అని పిలుస్తానని నాగార్జున గారిని బాబు అంటానని చెప్పుకొచ్చారట.కృష్ణ మరియు శోభన్ బాబును సార్ అని పిలుస్తానని అన్నపూర్ణ చెప్పుకొచ్చినట్లు సమాచారం..ఎన్నో సినిమాలలో నటించి మెప్పించిన అన్నపూర్ణ ఇప్పటికి తనదైన టైమింగ్ తో మంచి ఆదరగొడుతున్నట్లు సమాచారం. రోబోయే కొత్త సినిమాలలో అన్నపూర్ణ ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: