సమంతని దూరం పెడుతున్న టాలీవుడ్..

Purushottham Vinay
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత ఇటీవలే తన వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పిన విషయం అందరికి తెలిసిందే. టాలీవుడ్ యువ హీరో లవర్ బాయ్ అక్కినేని నాగచైతన్య ను ప్రేమ వివాహం చేసుకున్న సమంత .. తమ నాలుగేళ్ళ వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించడం జరిగింది.ఇక ఈ స్టార్ కపుల్ విడిపోవడానికి కారణాలు ఏమి వెల్లడించనప్పటికీ..ఇక దీనిపై ఇప్పటికీ కూడా పలు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇక చై-సామ్ విడాకుల వ్యవహారంలో తప్పు ఎవరిదనే కోణంలో సోషల్ మీడియాలో నెటిజనులు తెగ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.ఇక సమంత ఈ విడాకుల ప్రకటన చేసిన తర్వాత ఆమె పై సానుభూతి వస్తుందని చాలా మంది కూడా ఆలోచన చేశారు. అక్కినేని వంటి పెద్ద కుటుంబం నుంచి బయటకు వస్తున్నప్పటికీ.పైగా అమ్మాయి కాబట్టి సాధారణంగా సమంత సైడ్ ఎక్కువ సానుభూతి చూపిస్తారని భావించడం జరిగింది.

కానీ ఎందుకో సోషల్ మీడియాలో ఇంకా అలాగే టాలీవుడ్ లో ఆమె మీద పాజిటివ్ కామెంట్స్ కంటే నెగెటివ్ కామెంట్స్ అనేవే ఎక్కువగా వచ్చాయి.వస్తున్నాయి కూడా.ఇక ఈ వ్యవహారంలో సాధారణంగా నాగ చైతన్య కి ఇండస్ట్రీలో మంచి పేరు ఉండటంతో సమంత వైపే మిస్టేక్ ఉన్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆమెను ఒక రేంజిలో ట్రోల్స్ చేశారు.ఇక సమంతకి పిల్లలను కనడం అసలు ఇష్టం లేదని.. అందుకే విడిపోయారని కూడా నెటిజన్స్ విమర్శలు చేశారు.ఇక అలానే సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ తో కూడా ఎఫైర్ అనేది పెట్టుకున్నందని.. అందుకే వీరిద్దరి మధ్య వ్యవహారం విడాకుల వరకు వచ్చిందని అనేక కథలు అల్లారు. ఇక ఈ రూమర్స్ ని సమంత పూర్తిగా ఖండించింది. తన గోప్యతకు భంగం కలిగించొద్దని ఇంకా తనని ఇలాగా ఒంటరిగా వదిలేయాలని సమంత కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: