వర్తమాన నటితో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ ఛాటింగ్..షాకింగ్ నిజాలు బయటపెట్టిన ఎన్సీబీ..!

MADDIBOINA AJAY KUMAR
సినిమా ఇండస్ట్రీ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం ఈ రెండింటినీ వేరుగా చూడలేము అన్నట్టుగా తరచూ డ్రగ్స్ కేసులో సినిమా వాళ్ళు కనిపిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల‌లో డ్రగ్స్ కలకలం రేపుతోంది. ఇటీవల బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు డ్రగ్స్ కేసులో రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ముంబైలో క్రూయిజ్ నౌక‌లో జరిగిన పార్టీ సందర్భంగా డ్రగ్స్ తీసుకుంటూ ఆర్య‌న్ ఖాన్  పోలీసులకు చిక్కడంతో అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే తాజాగా ఆర్య‌న్ కాన్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ షాకింగ్ విషయాలను వెల్లడించింది. ముంబై క్రూయిజ్ పార్టీ సందర్భంగా వర్ధమాన నటి తో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ చాటింగ్ చేసినట్లు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. 

అయితే ఈరోజు మధ్యాహ్నం ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆ చాటింగ్ కు సంబంధించిన వివరాలను ఎన్సీబీ కోర్టుకు సమర్పించింది. అరెస్టయిన రోజే డ్ర‌గ్స్ గురించి మెసేజ్ ల‌ ద్వారా న‌టితో ఆర్య‌న్ ఖాన్ మాట్లాడినట్టు అధికారులు నిర్ధారించారు. అంతే కాకుండా సదరు నటి త్వరలోనే బాలీవుడ్ సినిమా ద్వారా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం కాబోతుంద‌ని సమాచారం. అదేవిధంగా కొందరు డ్ర‌గ్స్ సరఫరాదారుల తోనూ ఆర్య‌న్ ఖాన్ చాటింగ్ చేసినట్టు మెసేజ్ ల‌ను ఇప్పటికే ఎన్సీబీ అధికారులు కోర్టుకు సమర్పించారు. డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా దారుల‌తో తరచూ ఆర్య‌న్ ఖాన్ ట‌చ్ లో ఉన్నాడ‌ని అధికారులు కోర్టుకు తెలిపారు. ముంబైలోని స్పెషల్ కోర్టు ఆర్య‌న్ ఖాన్ బెయిల్ పిటిషన్ ప‌రిశీలిస్తోంది.

అయితే గత వారం వాదనలను విన్న స్పెషల్ కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. ఇక ప్రస్తుతం ఆర్య‌న్ ఖాన్ తో పాటు అదే విధంగా మరో ఐదుగురు నింధితులు  జైలులో ఉన్నారు. ఎన్సీబీ అధికారులు అందరికీ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇక కౌన్సిలింగ్ లో మాత్రం ఆర్యన్ ఖాన్ మార్పు త‌న‌లో మొద‌లైన‌ట్టు ఇంట్రెస్టింగ్ ముచ్చ‌ట్లు చెబుతున్నార‌ట‌. తాను జైలు నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర‌వాత పేద‌ల కోసం ప‌నిచేస్తా అని వారికి సాయం చేస్తాన‌ని ఆర్య‌న్ ఖాన్ చెబుతున్న‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: