ఘనంగా జబర్దస్త్ అవినాష్ పెళ్లి.. వైరల్ వీడియో?

praveen
ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గరయ్యారు అనే విషయం తెలిసిందే.  తమదైన శైలిలో కామెడీ పంచి తెలుగు ప్రేక్షకులందరికీ ప్రతివారం కడుపుబ్బ నవ్విస్తూ గుర్తింపు సంపాదించుకున్నారూ. ఇలా జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా బాగా పాపులర్ అయిన కమెడియన్స్ లో ముక్కు అవినాష్ కూడా ఒకడు.  జబర్దస్త్ లో ముక్కు అవినాష్ గా పేరు తెచ్చుకున్న ఈ కమెడియన్ ఇక ఎన్నో రోజుల పాటు జబర్దస్త్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. కానీ ఆ తర్వాత జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసి ఒక్కసారిగా బిగ్ బాస్ హౌస్ లో ప్రత్యక్షం అయ్యాడు అవినాష్.  దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు అని చెప్పాలి.


 ఇక అటు బిగ్ బాస్ హౌస్ లో కూడా ఎన్నో వారాల పాటు కొనసాగిన ముక్కు అవినాష్ ఆ తర్వాత బయటకు వచ్చాక కూడా జబర్దస్త్ కి మళ్ళీ తిరిగి రాలేదు.  ఇక మా టీవీ లో వివిధ కార్యక్రమాలలో కామెడీ పంచుతూ ప్రస్తుతం దూసుకు పోతున్నాడు   అయితే జబర్దస్త్ అవినాష్ ఇటీవలే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు అన్న విషయం తెలిసిందే. అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.  ఇక ఇటీవల ఎంగేజ్మెంట్ వీడియో ని కూడా ముక్కు అవినాష్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే.

 కాగా ఇటీవలే జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ వివాహం ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇప్పటికే ముక్కు అవినాష్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. ఆ తర్వాత ఇక పెళ్లి వీడియో ని కూడా పోస్ట్ చేయాలి అని అనుకున్నాడు. కానీ అంతలోనే మరో జబర్దస్త్ కమెడియన్ అవినాష్ పెళ్లి వీడియో ని  బయట పెట్టేసాడు. నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ ఇంస్టాగ్రామ్ వేదికగా రాంప్రసాద్ ఒక పోస్టు పెట్టారు. సారీ.. బ్లండర్ మిస్టేక్ కానీ తప్పడం లేదు అంటూ దీనికి ఒక విచిత్రమైన ట్యాగ్ కూడా ఇచ్చాడు ఆటో రాంప్రసాద్. ఇక ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది. ఇక ఈ పెళ్లి వీడియో చూసిన అభిమానులు మురిసిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: