టాలీవుడ్‌లో అల్లు ఫ్యామిలీ రాజ‌కీయం మామూలుగా లేదే...!

VUYYURU SUBHASH
తాజాగా టాలీవుడ్ లో మా ఎన్నిక‌ల వేళ ఇండ‌స్ట్రీ రెండు వ‌ర్గాలు గా చీలిపోయి ఎలా ర‌చ్చ కెక్కిందో చూశాం. ఇండ‌స్ట్రీలో ఉన్న రాజ‌కీయాలు అన్ని ఈ మా ఎన్నిక‌ల సాక్షి గా బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. ఈ ఎన్నిక‌ల పుణ్య‌మా అంటూ టాలీవుడ్ లో చిన్నా చిత‌క న‌టుల నుంచి స్టార్ హీరోల వ‌ర‌కూ మా రాజ‌కీయ వేడిలో మండి పోయారు. ఇలాంటి టైంలో ఈ రాజ‌కీయాల‌కు దూరంగా చాలా కూల్ గా క‌నిపిస్తోంది అల్లు ఫ్యామిలీ. అంతే కాకుండా త‌మ‌కు అంద‌రూ కావాలంటూ స‌రికొత్త రాజ‌కీయానికి తెర‌దీసింది.

మా ఎన్నిక‌ల్లో మెగా ఫ్యామిలీ ప్ర‌కాష్ రాజ్ ను గెలిపించ‌డాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంద‌నే ప్ర‌చారం ముమ్మ‌రంగా జ‌రిగింది. ఇలాంటి టైంలో కూడా అల్లు ఫ్యామిలీ హీరోలు అల్లు అర్జున్ , అల్లు శిరీష్‌ క‌నీసం త‌న ఓటు హ‌క్కును వినియోగించుకోకుండా పెద్ద షాకే ఇచ్చారు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు చేసినా కూడా అర‌వింద్ ప్ర‌భుత్వానికి ప‌రోక్షంగా త‌న స‌పోర్ట్ ఇచ్చారు. పైగా జ‌గ‌న్ ను క‌నిక‌రించాల‌ని వేడుకున్నారు.

మ‌రో వైపు నంద‌మూరి బాల‌కృష్ణ తో ఆహా లో ఓ టాక్ షోకు సంబంధించి చాలా గ్రాండ్ ఈవెంట్ చేశారు. ఇది బాగా హైలెట్ అయ్యింది. ఈ ఈవెంట్ లో త‌మ‌కు నంద‌మూరి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం గురించి అల్లు అర‌వింద్ చెపితే.. మ‌రో వైపు బాల‌య్య అల్లు అర‌వింద్ కుటుంబంతో పాటు ఆయ‌న తండ్రి అల్లు రామ‌లింగ‌య్య గారితో ఉన్న అనుబంధం గురించి చ‌క్క‌గా చెప్పారు.

మ‌రో వైపు అక్కినేని ఫ్యామిలీ తో అల్లుకు ఎలాగూ అనుబంధం ఉంది. అప్పుడు 100 % ల‌వ్ సినిమా తీసి చైతుకు హిట్  ఇచ్చారు. తాజాగా అఖిల్‌కు మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ తో కెరీర్‌లో ఫ‌స్ట్ హిట్ ఇచ్చారు. ఇలా అల్లు ఫ్యామిలీ మెగా బ్రాండ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి అంద‌రి వాడిగా నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: