గన్ను పట్టుకొని ఆ ఆఫీస్ కి వెళ్ళిన మోహన్ బాబు..!

Divya
ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఏమిటంటే మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ. గురించి ఎక్కువగా వినిపిస్తోంది. మా ఎలక్షన్లలో ఆయన చేసిన కొన్ని వాక్యాలు చాలా దుమారం రేపడం వల్ల ఎక్కువగా మోహన్ బాబు పేరు వినిపిస్తూనే ఉంది. ఇక మోహన్ బాబు బెనర్జీపై అరవడంతో ఆయన ఒక్కసారిగా భయపడి పోయాను అంటూ చేసిన వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇక ఈ విషయంపై.. సీనియర్ జర్నలిస్టు అయిన జకీర్ కొన్ని విషయాలను ఇంటర్వ్యూలొ  మోహన్ బాబు గురించి క్లియర్ గా తెలియజేశాడు. కొన్ని సంవత్సరాల కిందట మోహన్ బాబు టీవి-9 ఆఫీస్ కార్యాలయానికి కూడా ఒకసారి గన్ను తోనే వచ్చి బెదిరించారని చెప్పుకొచ్చాడు. ఇక అంతే కాకుండా మా ఎన్నికల సమయంలో మోహన్ బాబు కొంతమందిని బెదిరించాడని చెప్పుకొచ్చాడు. ఎవరి మీదనైనా కూడా చేయి చేసుకుంటాడు, ఆయన రౌడీయిజం మొత్తం నేను అప్పట్లో టీవీ -9 లో పనిచేసేటప్పుడు చూశానని జకీర్ చెప్పుకొచ్చారు
ఏదో విషయంపై ఆయన కుటుంబంపై ఏదో ఒక వార్త వచ్చిందని.. టీవీ9 ఆఫీస్ పైకే దాడి చేసేందుకు ప్రయత్నించాడని చెప్పుకొచ్చాడు. ఒక తుపాకీ తీసుకువచ్చి రవి ప్రకాష్ గాడు ఎక్కడ అంటూ పెద్దగా అరిచి అతని చంపేస్తాను అని గట్టిగా భయపడించాడట. నిజానికి మోహన్ బాబు పైన ఎటువంటి వార్త వచ్చిన ఆయన అధికారికంగా మీడియాతో మాట్లాడి ఏదో ఒక వివరణ ఇవ్వాల్సి ఉండేది.


రవి ప్రకాష్ చేసిన దాంట్లో మోహన్ బాబు తప్పు ఉంది. ఆయన పరువు నష్టం దావా వేసి ఉంటే సరిపోతుంది అని చెప్పుకొచ్చాడు జకీర్. లేకపోతే మీడియా అధికారులతో మోహన్ బాబు మాట్లాడి చర్చించుకోవచ్చు కద. గన్నుతో రావడం వల్ల ఆయన పరువు పోయిందని చెప్పుకొచ్చాడు జకీర్.ఇక మొన్న జరిగిన మా ఎలక్షన్లలో మోహన్ బాబు కోపం తెచ్చుకోవడం వల్ల.. మోహన్ బాబుకే నష్టం కలిగిస్తుందని చెప్పుకొచ్చాడు జకీర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: