రాదే శ్యామ్ టీజర్ విడుదల తేదీ ని ప్రకటించిన చిత్ర బృందం..!

Pulgam Srinivas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు, ఆ తర్వాత ప్రభాస్ ఆ స్టార్ డమ్ ను కాపాడుకునే నేపథ్యంలో వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు, ఇప్పటికే సాహో సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించి అదే స్థాయిలో విడుదల కూడా చేశాడు. అయితే ఆ తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, రాదే శ్యామ్ అనే సినిమాను ప్రారంభించాడు, ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలాకాలమే అవుతుంది. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14 జనవరి 2022 లో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది. ఇలా ఎప్పుడో ఒక అప్డేట్ తప్ప పెద్దగా ఈ సినిమా విషయాలు ఏవి చిత్రబృందం బయటకు వదలడం లేదు. అయితే  ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను ఎప్పుడు విడుదల చేస్తారా అని ప్రభాస్ అభిమానులు ఎంతో కాలం నుండి ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.

 ఇలా రాదే శ్యామ్ సినిమా టీజర్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ల ఈ సినిమా చిత్రబృందం తాజాగా ఒక అదిరిపోయే అప్డేట్ ను తెలియజేసింది. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా 23 జనవరి 2021 న ఉదయం 11 గంటల 16 నిమిషాలకు రాధే శ్యామ్ టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. చిత్ర బృందం పోస్ట్ చేసిన ఈ ఫోటోలకు విక్రమాదిత్య ఎవరు అంటూ రాసుకొచ్చారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాతో పాటు ఆది పురుష్, సలార్ సినిమాలలో కూడా హీరోగా నటిస్తున్నాడు. వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ఒక సినిమాలో, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి ప్రభాస్ రెడీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: