పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి.. కడుపుబ్బ నవ్వించిన నాగార్జున?

praveen
సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో పోలీస్ కథ నేపథ్యం లో ఉండే సినిమాలు వస్తూ ఉంటాయి  అయితే ఇలాంటి సినిమాలకు తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంటాయ్. ఇలాంటి సినిమాలు విడుదలయ్యాయి అంటే చాలు థియేటర్లకి పరుగులు పెడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ ఎంతోమంది టాలీవుడ్ స్టార్ హీరోలు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. టాలీవుడ్ మన్మధుడు గా కొనసాగుతున్న నాగార్జున కూడా ఇప్పటివరకు పలు సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు.  కొన్ని సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు నాగార్జున.

 కానీ పోలీస్ ఆఫీసర్ పాత్ర అంటే సీరియస్ గానే ఉండాలి అన్న నానుడికి స్వస్తి పలుకుతూ ఆవిడా మా ఆవిడే అనే సినిమాలో ఏకంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ప్రేక్షకులను నవ్వించాడు. కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆవిడ మా ఆవిడే అనే సినిమా 1988లో  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలో నాగార్జున పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడు. ఇక ఈ పోలీస్ ఆఫీసర్ పాత్ర సినిమా మొత్తం ప్రేక్షకులందరూ కడుపుబ్బా నవ్వుకునే కామెడీ పంచుతుంది అని చెప్పాలి. మొదట మరో పోలీస్ ఆఫీసర్ అయిన టబు ని పెళ్లి చేసుకుంటాడు నాగార్జున. తర్వాత టబు ఒక బాంబు బ్లాస్ట్లో చనిపోయింది అని నమ్ముతాడు.

 ఆ తర్వాత తల్లిదండ్రుల ఒత్తిడితో హీర రాజగోపాల్ ను పెళ్లి చేసుకుంటాడు నాగార్జున  కాని అంతలోనే మొదటి భార్య టబు తిరిగి వస్తుంది. దీంతో  వీరిద్దరిని కవర్ చేయడానికి ఎక్కడ లేని కష్టాలు పడుతూ ఉంటాడు నాగార్జున. ఇలా ఇద్దరు భార్యల మధ్య నాగార్జున నలిగిపోతుండటం అటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమా అప్పట్లో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇటు నాగార్జున కెరీర్లో ఇక ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అని  చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే పోలీస్ ఆఫీసర్ పాత్రలు అంటే సీరియస్ గానే ఉండాలి అనే నానుడికి ఈ సినిమా స్వస్తి పలికింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: