పోలీస్ పాత్రలో నటించి.. బాబు బంగారం అనిపించుకున్న వెంకటేష్?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో అయినా వెంకటేష్ ఎన్నో సినిమాల్లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఇక ఇలా వెంకటేష్ నటించిన పోలీస్ కథ సినిమా లో ఘర్షణ సినిమా కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. డ్యూటీ కోసం ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధంగా ఉండే పోలీస్ ఆఫీసర్ రామచంద్ర పాత్రలో నటిస్తాడు వెంకటేష్.  ఇక ఈ సినిమాలో ఇక అటు పోలీస్ పవర్ ఏంటో చూపించే విధంగా ఉంటుంది. కానీ ఇలా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన వెంకటేష్ బాబు బంగారం అనే సినిమాలో మాత్రం ఎంతో సున్నితమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరిస్తాడు.

 ఇక ఈ సినిమా తెలుగు ప్రేక్షకులందరికీ బాగా కనెక్ట్ అయ్యింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన వెంకటేష్..  బాబు బంగారం అనే సినిమాలో మాత్రం కామెడీ చేస్తూ విలన్స్ అందరితో ఆడుకుంటూ ఉంటాడు. ఇక అటు యాక్షన్ సన్నివేశాలలో కూడా దర్శకుడు కామెడీ యాడ్ చేయడంతో ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయారు అనే చెప్పాలి. విభిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు మారుతి ఈ సినిమాను తెరకెక్కించాడు. సినిమాలో వెంకటేష్ లక్కీ క్వీన్ అయిన నయనతార హీరోయిన్ గా నటించింది.

 ఈ సినిమాలో ఎంతో సున్నితమైన మనస్తత్వం ఉన్న పోలీస్ పాత్రలో నటిస్తాడు వెంకటేష్. తప్పు చేసిన విలన్లను దంచి కొట్టి ఒక ఆటాడుకోవడమే కాదు ఇక ఆ తర్వాత అదే విలన్స్ మీద జాలిపడి ఏకంగా హాస్పిటల్ కు పంపించి కేరింగ్ గా చూసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఇలాంటి సమయంలోనే తాను ప్రేమించిన అమ్మాయి కోసం ఏకంగా విలన్ల తో ఒక ఆట ఆడుకుంటున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ చెప్పే ప్రతి డైలాగ్ కూడా ప్రేక్షకులను ఎంతగానో కనెక్ట్ అవుతుంది. మరీ ముఖ్యంగా వెంకటేష్ బ్రహ్మానందం మధ్య సాగే సన్నివేశాలు అయితే ప్రతి ఒక్కరికి ఎంతగానో కనెక్ట్ అయిపోయి కడుపుబ్బ నవ్విస్తాయి అనే చెప్పాలి. తనదైన శైలిలో కామెడీ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు వెంకటేష్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: