గత్తర్ లేపిన గబ్బర్ సింగ్ !

Veldandi Saikiran
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నో వైవిధ్య కథాంశాలతో అనేక సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రేమకథ అంశాలు, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అలాగే పోలీస్ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా పోలీస్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బాగా హిట్ అయ్యాయి.  ఈ కోవలో మొదటి వరుసలో ఉండేది గబ్బర్ సింగ్ సినిమా. గబ్బర్ సింగ్ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించగా.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ ఆయన సరసన నటించింది. ఇక ఈ గబ్బర్ సింగ్ సినిమా 2012 సంవత్సరంలో విడుదల కాగా ఈ సినిమాను... బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కించారు. 

ఇక ప్రముఖ హిందీ నటుడు సల్మాన్ ఖాన్ సంచలనాత్మక విజయం సాధించిన దబాంగ్ సినిమాకు రీమేక్ గా గబ్బర్ సింగ్ సినిమా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తెరకెక్కింది. ఇక ఈ సినిమాకు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించారు టాలీవుడ్ యంగ్ దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించారు. ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత స్వరాలు అందించగా... 2012 సంవత్సరం వేసవి  స్పెషల్ గా మే 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదలైంది. జై సినిమా విడుదలైన తర్వాత ఏకంగా 63 కోట్ల వసూళ్లను సాధించింది తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ రికార్డు సృష్టించింది. గబ్బర్ సింగ్ సినిమా కథ వివరాల్లోకి వెళితే... ఈ సినిమాలో పవర్స్టార్ పవన్కళ్యాణ్ పోలీస్ గెటప్ లో కనిపిస్తారు.

చిన్నతనంలోనే ఇంట్లోంచి వెళ్లిన పవన్ కళ్యాణ్... తన సొంతూరు కె ఎస్సైగా వస్తారు. ఈ నేపథ్యంలోనే విలన్ కు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వివాదం తలెత్తింది. అలాగే సినిమాలో తన ఫ్యామిలీ ని మళ్ళీ ఎలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుసుకుంటారో అనే దానిపైనే ఈ కథాంశం ఉంటుంది. అటు శృతిహాసన్ మరియు పవన్ కళ్యాణ్ కి మధ్య రొమాంటిక్ సీన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీత స్వరాలు ఇప్పటికీ అందరి నోళ్ళలో నానుతున్నాయి. అటు కామెడీ కూడా ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు దర్శకుడు హరీష్ శంకర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: