పవన్ కళ్యాణ్ సినిమాకు దర్శకత్వం వహించనున్న మహేష్ బాబు దర్శకుడు..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత కాస్త సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు, ఆ తర్వాత మళ్లీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను పలకరించాడు, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడంతో పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్ లో పెడుతూ ముందుకు దూసుకు పోతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తున్నాడు, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుబాటి రానా కూడా మరొక హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా తో పాటు పవన్ కళ్యాణ్ తెలుగు క్రేజీ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు.

అలాగే పవన్ కు కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో బాక్సాఫీసు వద్ద అదిరిపోయే బ్లాక్ బస్టర్ ను అందించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో భగవదియుడు భగత్ సింగ్ అనే సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ హీరోగా నటించడానికి రెడీ గా ఉన్నాడు. ఈ సినిమా తో పాటు టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు, ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా కొన్ని రోజుల క్రితమే జరిగింది. ఇలా వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న పవన్ కళ్యాణ్ తాజాగా మరొక సినిమాను కూడా సెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లో మంచి కామెడీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో నటించబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎఫ్ త్రీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న అనిల్ రావిపూడి, పవన్ కళ్యాణ్ తో సినిమా కంటే ముందు మరో స్టార్ హీరోతో ఒక సినిమా, మహేష్ బాబు తో ఒక సినిమా పూర్తి చేసుకొని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాను  స్టార్ట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: