ఎగ్జిబిటర్ల ఆలోచనలతో అంతర్మధనంలో టాప్ హీరోలు !

Seetha Sailaja

టాప్ హీరోల సినిమాలకు రికార్డు స్థాయిలో కలక్షన్స్ రావాలి అంటే ఎగ్జిబిటర్స్ సహకారం లేనిదే అవ్వని పని. సగటు ప్రేక్షకుడు ఒక భారీ సినిమాని ధియేటర్లలో చూసినప్పుడు పొందినంత ఆనందం బుల్లితెర పై పొందలేడు. వెండితెర పై మెరిసినప్పుడు మాత్రమే హీరోలు టాప్ హీరోలుగా మారుతారు.

దీనితో అనేక భారీ సినిమాలకు ప్రముఖ ఓటీటీ సంస్థలు భారీ ఆఫర్లు ఇస్తున్నప్పటికీ భారీ సినిమాలు అన్నీ ధియేటర్ల పైనే ఆశలు పెట్టుకున్నాయి. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు సద్దుమణిగాకా ధియేటర్లు ఓపెన్ చేసినప్పుడు సరైన హిట్ సినిమా వచ్చిన వెంటనే ఫ్యామిలీ ప్రేక్షకులు ధియేటర్లకు విపరీతంగ వస్తారు అన్న అంచనాలు వేసుకున్నారు.

‘లవ్ స్టోరీ’ మూవీకి టోటల్ పాజిటివ్ టాక్ రావడంతో ఊహించిన విధంగానే ఫ్యామిలీ ప్రేక్షకులు ధియేటర్లకు వచ్చారు. అయితే ఈహడావిడి కేవలం మొదటి వారం రోజులు మాత్రమే కనిపించింది కానీ ఆతరువాత పెద్దగా కనిపించక పోవడంతో ఈమూవీకి 30 కోట్ల కలక్షన్స్ వచ్చాయి అన్నప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ‘లవ్ స్టోరీ’ కి వచ్చిన పాజిటివ్ టాక్ గతంలో సినిమాలకు వచ్చినప్పుడు అలాంటి మీడియం రేంజ్ సినిమాలకు చాల సునాయాసంగా 60 కోట్ల కలక్షన్స్ వస్తూ ఉండేవని ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉందని ధియేటర్ల వర్గాలు కామెంట్స్ చేస్తున్నట్లు టాక్. ఇక దసరా నాడు విడుదల అయిన అఖిల్  ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’  కలెక్షన్స్ కూడ అంతంత మాత్రంగానే ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి.

ధియేటర్ వర్గాల అభిప్రాయం ప్రకారం దీనికి ఒక కారణం ఉంది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆసినిమా నెలరోజుల లోపే ఓటీటీ లలో విడుదల చేస్తున్న పరిస్థితులలో సినిమాల పట్ల మరీ మోజు ఉన్న ప్రేక్షకులు తప్ప మిగతా ప్రేక్షకులు ఇప్పటికీ ధియేటర్లకు దూరంగా ఉంటూ ఓటీటీ లో చూసుకోవచ్చు కదా అన్న అభిప్రాయంలో ఉన్నట్లు ధియేటర్ వర్గాలు కామెంట్స్ చేస్తున్నాయి. ఈ కామెంట్స్ అన్నీ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ల దృష్టి వరకు వెళ్ళడంతో టాప్ హీరోల సినిమాలను భారీ రేట్లకు కొనాలని భావిస్తున్న వారంతా అంతర్మధనంలో ఉన్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: