ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్ ప్లాన్ చేసిన బొమ్మరిల్లు భాస్కర్.. కానీ..?

Anilkumar
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఇద్దరు హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. కానీ ముగ్గురు హీరోల మల్టీస్టారర్ అంటే.. వినడానికే ఈ సౌండ్ చాలా కొత్తగా ఉంది. ఇప్పటివరకు ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్ ను ఏ ఒక్క దర్శకుడు కూడా ప్లాన్ చేయలేదు.అంతెందుకు మన దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఇప్పటివరకు ఆ ధైర్యం చేయలేదు. అయితే గతంలోనే ఇలాంటి ఒక సినిమా రావాల్సింది? కానీ ఎందుకనో ఆ సినిమా ఆగిపోయింది.ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో దీని గురించే చర్చ నడుస్తోంది.నిజానికి ఈ చర్చ మొదలైంది దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ దగ్గరి నుంచి.

ఇటీవల 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ..'తన 'ఒంగోలు గిత్త' సినిమా తర్వాత గ్యాప్ రావడానికి కారణం ఏంటో చెప్పాడు.అయితే అప్పుడు ఆయన ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్ సినిమా తీద్దామని అనుకున్నాడట.దిల్ రాజు బ్యానర్లో ఈ ముగ్గురు హీరోల మల్టీస్టారర్ చేయాలని అనుకున్నాడు భాస్కర్.తమిళంలో హిట్ అయిన 'బెంగుళూరు నాటకల్' సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.తమిళంలో రానా, బాబీ సింహా హీరోలుగా నటించారు. ఇక మలయాళంలో 'బెంగుళూరు డేస్' పేరుతో దుల్కర్ సల్మాన్,ఫాహాద్ ఫాజిల్, నివిన్ పాలి హీరోలుగా రీమేక్ అయ్యింది.

ఇక ఈ సినిమాను తెలుగులో నాగ చైతన్య, ఎన్టీఆర్ లతో పాటు మరో హీరోతో చేద్దామని దిల్ రాజు అనుకున్నారు.ఇక దీనికి దర్శకుడిగా బొమ్మరిల్లు భాస్కర్ అనుకున్నారు. ఈ కథ మీద భాస్కర్ కొన్ని రోజులు వర్క్ కూడా చేసారు.కానీ ఆ తర్వాత ఆ సినిమా ఊసే వినిపించలేదు.దీంతో ఆ వార్త ఓ పుకారు గానే మిగిలిపోయింది.ఇక అప్పుడు జరిగిన ఈ విషయాన్ని బొమ్మరిల్లు భాస్కర్ ఇప్పుడు చెప్తూ డేట్స్ కుదరక ఆ సినిమా ఆగిపోయిందని చెప్పాడు.మరి నిజంగా బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమా చేసుంటే ఎలా ఉండేదో కదా.ఇక తాజాగా ఈ దర్శకుడు తెరకెక్కించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా దసరా కానుకగా విడుదలై పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: