కీర్తి సురేష్ యాంకర్ అవబోతుందా...?

Sahithya
దక్షిణాది భాషల్లో కీర్తి సురేష్ తిరుగులేని విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న సంగతి మనకు తెలిసిందే. వరుస విజయాలతో కీర్తి సురేష్ ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేస్తూ ముందుకు వెళుతోంది. మహానటి సినిమా తర్వాత టాలీవుడ్ దర్శకులు అందరూ కూడా ఆమెను తమ సినిమాల్లో కి తీసుకోవడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ లో పెద్ద హీరోలు కూడా కీర్తి సురేష్ విషయంలో చాలా సానుకూలంగా ఉండటమే కాకుండా ఇతర భాషల్లో కూడా కొంత మంది అగ్ర దర్శకులు కీర్తి సురేష్ కు అవకాశం ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు.
తనకు వచ్చిన అవకాశాలను కీర్తి సురేష్ ఈ మాత్రం కూడా పోగొట్టుకునే ప్రయత్నం చేయడం లేదు అనే విషయం అర్థమవుతుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో రెండు మూడు సినిమాలు చేస్తుండగా తమిళంలో రెండు సినిమాలు అలాగే మలయాళంలో ఒక సినిమా కన్నడంలో ఒక సినిమాకు సంతకం చేసింది. ఇదిలా ఉంటే కీర్తి సురేష్  యాంకర్ గా మారే అవకాశం ఉందనే వార్తలు కూడా టాలీవుడ్ వర్గాల్లో బాగా వినబడుతున్నాయి. కీర్తి సురేష్ తో ఒక ప్రముఖ ఛానల్ సంప్రదింపులు జరుపుతోందని త్వరలోనే ఆమె యాంకర్ గా మారే అవకాశాలున్నాయని అంటున్నారు.
పూర్తి స్థాయి యాంకర్ గా కాకుండా ఒక షో కి ఆమె వ్యాఖ్యాతగా చేసే అవకాశం ఉందని ఆ షోలో ఆమె ఇంటర్వ్యూ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. సినిమా పెద్దలతో ఆమె ఇంటర్వ్యూ చేస్తారని అయితే ఇంటర్వ్యూలు కాస్త భిన్నంగా ఉంటాయని కూడా అంటున్నారు. ఈ ఛానల్ దాదాపుగా నాలుగు భాషల్లో ఇంటర్వ్యూ చేసే అవకాశం ఉందని నాలుగు భాషల్లో కూడా కీర్తి సురేష్ కి అవకాశం ఇచ్చారని వారానికి రెండు రోజులపాటు దీనికి సంబంధించిన షూటింగ్ దాదాపుగా మూడు నెలల పాటు ఉంటుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: