నెట్ ఫ్లిక్స్ సంచ‌ల‌నం స్క్విడ్ గేమ్ మ‌రో రికార్డ్

Dabbeda Mohan Babu
ఈ మ‌ధ్య కాలంలో నెట్ ఫ్లిక్స్ విడుద‌ల అయిన స్క్విడ్ గేమ్ ఎన్నో సంచ‌ల‌నం సృష్టిస్తుంది. ప్ర‌స్తుతం స్క్విడ్ గేమ్ అంటే తెలియ‌ని వారు ప్ర‌పంచం లో చాలా త‌క్కువ మంది ఉంటారు. అంత లా క్రేజ్ తెచ్చు కున్న ఈ వెబ్ సిరిస్ రోజు రోజుకు రికార్డు ల‌ను కొల్ల‌గొడుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా రికార్డు ల‌ను త‌న సొంతం చేసుకున్న స్క్విడ్ గేమ తాజా గా మ‌రో రికార్డు ను కూడా త‌న ఖాత లో వేసుకుంది. విడుద‌ల అయిన 28 రోజుల్లోనే ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకున్న వెబ్ సిరిస్ గా రికార్డు న‌మోదు చేసుకుంది. ఇది నెట్ ఫ్లిక్స్ చ‌రిత్ర లో నే ప్ర‌స్తుతం త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ వ్యూస్ వ‌చ్చిన వెబ్ సిరిస్. ప్ర‌స్తుతం దీని వ్యూస్ ఎంత అంటే.. దాదాపు 11 కోట్ల పైనే ఉంటుంది. అలాగే ప్ర‌స్తుతం స్క్విడ్ గేమ్ వెబ్ సిరిస్ ప్ర‌పంచ లో నే నెంబ‌ర్ వ‌న్ వెబ్ సిరిస్ గా నెట్ ఫ్లిక్స్ లో కొన‌సాగుతుంది.


ఈ  స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ వ‌ల్ల నెట్ ఫ్లిక్స్ దాదాపు 900 మిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కు లాభం పొందింది. అంతలా ఈ వెబ్ సిరీస్ ను ప్ర‌పం చ జ‌నం ఆధ‌రిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లో గ‌తంలో వచ్చిన సినిమాలు , వెబ్ సిరిస్ కంటే ఈ  స్క్విడ్ గేమ్ కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ వెబ్ సిరిస్ లో మొత్తం 9 ఎపిసోడ్స్ ఉంటాయి. అలాగే  స్క్విడ్ గేమ్ మొద‌టి సీజ‌న్ మొత్తం 8 గంట‌ల 12 నిమిషాల నిడివి తో ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ లో కొంత మంది ని ఎంచు కుని కొన్ని గేమ్స్ పెడుతారు. ఈ గేమ్స్ లో ఓడిపోయిన వారిని చంపి ఎలిమినేట్ చేస్తారు. అలా చివ‌రి వ‌ర‌కు అన్ని గేమ్స్ లో ఓడిపోకుండ ఉన్న వారికి పెద్ద మొత్తంలో ప్రైజ్ మ‌నీ ఇస్తారు. ఈ గేమ్ ల‌లో చివ‌రి వ‌ర‌కు హీరో ఒక్క‌డే ఉంటాడు. అయితే ఈ వెబ్ సిరీస్ లో చాలా ట్వీస్ట్ లు ఉంటాయి. అలాగే కొన్ని ర‌క్త పాతం ఉన్న సీన్స్ ఉంటాయి కాబ‌ట్టి పెద్ద‌లు అలాగే గుండే ధైర్యం ఉన్న వారు మాత్ర‌మే చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: