మంచు విష్ణు గెలుస్తాడని ముందే తెలుసు: తెలంగాణా మంత్రి సంచలనం

Sahithya
నూతన మా అధ్యక్షుడిగా మంచు విష్ణు నేడు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే. నేడు ఈ కార్యక్రమం ఘనంగా జరగగా ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు అయ్యారు. సాధారణ ఎన్నికలకు తలపించేలా మా ఎన్నికలు జరిగాయి అని అయన వెల్లడించారు. మంచు విష్ణు ప్యానెల్ ను ఎన్నుకున్న సభ్యులకు ధన్యవాదాలు చెప్పారు ఆయన. విష్ణు విజయం సాధిస్తారు అని 10 రోజుల ముందే చెప్పాను అని ఎన్నికైన సభ్యులందరికి శుభాకాంక్షలు అని ఆయన అన్నారు.
మా అసోసియేషన్ అంటే చాలా పెద్ద ఫ్యామిలీ అని అన్నారు ఆయన. ఇంత పెద్ద వ్యవస్థ బాధ్యత ఇప్పుడు యువకుడు మంచు విష్ణు మీద ఉంది అని ఆయన పేర్కొన్నారు. చదువు, సంస్కారం, గౌరవ వ్యక్తిత్వం మోహన్ బాబు మంచు విష్ణుకు నేర్పించాడు అని ఇండస్ట్రీలో మోహన్ బాబుకు కోపం, ఆవేశం ఎక్కువ అనేది అందరికి తెలుసు అని ఆయన పేర్కొన్నారు. కోపం, ఆవేశం వల్ల మోహన్ బాబు నష్టపోయారు కానీ ఇతరులను నష్టపరచలేదు అని తెలిపారు. తప్పును తప్పు అని దైర్యంగా చెప్పే వ్యక్తి మోహన్ బాబు అన్నారు ఆయన.
మోహన్ బాబుకు నాకు అన్నదమ్ముల అనుబంధం 25 ఏండ్లుగా ఉంది అని చెప్పుకొచ్చారు. విద్యాసంస్థలను స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్నారు అని అన్నారు. మంచి ప్యానెల్ ను మా సభ్యులు ఎన్నుకున్నారు అని వెల్లడించారు. మా ప్యానెల్ కు తెలంగాణ ప్రభుత్వం సహాయ, సహకారాలు ఉంటాయి అని స్పష్టం చేసారు. సినిమా ఇండస్ట్రీ కి హైద్రాబాద్ హబ్ గా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు అన్నారు. సింగిల్ విండో ద్వారా ఫిల్మ్ డెవల్ప్మెంట్ కార్పొరేషన్ లో అప్లై చేసుకుంటే అన్ని అనుమతులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. ఆన్లైన్ టికెటింగ్ కు తెలంగాణ రాష్ట్రంలోనే అంకురార్పణ జరిగింది అని వివరించారు. షూటింగ్ కి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి అని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ .

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: