చిరంజీవి-మోహన్ బాబు మధ్య జరిగిన సంభాషణ తెలిపిన బెనర్జీ..?

Divya
మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎలా జరిగాయో మనం చూసాము. అలా ఎన్నికల అనంతరం మంచు విష్ణు చిరంజీవిపై కొన్ని వాక్యాలు కూడా తెలియజేశాడు. చిరంజీవి తనని మా ఎలక్షన్ లో నుంచి తప్పుకోమన్నారు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. కానీ ఆ విషయంపై మేము ఎవరు అంగీకరించలేదని.. కచ్చితంగా పోటీలో కొనసాగుతామని తెలియజేశామని చెప్పుకొచ్చారు విష్ణు.

ఈ విషయంపై యాక్టర్ బెనర్జీ స్పందిస్తూ.. చిరంజీవి మోహన్ బాబు ఫోన్ చేసిన మాట వాస్తవమే.. ఏం జరిగిందో ఆ విషయాన్ని విష్ణు తెలియజేయలేదని చెప్పుకొచ్చారు. రానున్న రెండు సంవత్సరాలు మా ను ఎలా నడిపించాలనే ఒక ప్రణాళికను వేశారు ప్రకాష్ రాజ్. ఆయన తెలిపిన విషయాలు, ఆలోచనలు బాగా చిరంజీవికి నచ్చడంతో ప్రకాష్ రాజ్ మీద ఇంప్రెస్ అయ్యి ఆయనకు మద్దతుగా నిలిచాడు అంటూ చెప్పుకొచ్చాడు బెనర్జీ.

అందుకోసమే ప్రకాష్ రాజ్ ని ఏకగ్రీవం అయ్యేలా మోహన్ బాబు ని అడిగారు అన్నట్లుగా తెలియజేశాడు. ఇక మోహన్ బాబుకు చిరంజీవి ఫోన్ చేసి.. ప్రకాష్ రాజ్  ఇప్పుడు కనుక ఏకగ్రీవం చేసినట్లయితే.. రెండు సంవత్సరాల తర్వాత మంచు విష్ణు అధ్యక్షుడు గా ఉండమని నేనే స్వయంగా తెలియజేస్తానని మోహన్ బాబుకు చిరంజీవి చెప్పారని బెనర్జీ తెలియజేశారు.

కానీ చిరంజీవి చెప్పిన మాటలను మోహన్ బాబు అంగీకరించలేదు. ఇక దీంతో ఎవరు ఏం చేసేది లేక ఎన్నికలు అనివార్యమయ్యాయని చెప్పుకొచ్చారు బెనర్జీ. కానీ కొద్దిరోజుల కిందట మాత్రం మంచు విష్ణు అయితే సినీ ఇండస్ట్రీలో ఉంటే పెద్దలు వచ్చి ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం చేస్తానని తెలియజేస్తే  నేనే స్వయంగా ఈ పోటీలో నుంచి తప్పుకుంటానని చెప్పుకొచ్చాడు విష్ణు. అందుకు సంబంధించి అప్పట్లో ఒక వీడియో కూడా బాగా పాపులర్ అయింది. ఎట్టకేలకు ఎన్నికలు జరిగిపోయాయి, వీరిద్దరి మధ్య జరిగింది ఇదే అంటున్న బెనర్జీ.ఇంతకుమించి ఏం జరగలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: