"పెదరాయుడు" సినిమాను వదులుకున్న బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎవరో తెలుసా..??

VUYYURU SUBHASH
"పెదరాయుడు".. ఈ సినిమా గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. అప్పట్లో ఈ సినిమా ఓ సంచలనం. రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేసిన  ఈ సినిమా 1995లో రిలీజై ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా..భారీ కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా అప్పట్లో తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన 'నాట్టామై' సినిమాకి ఇది రీమేక్. నిజం చెప్పాలంటే మోహన్ బాబు కి లైఫ్ ఇచ్చిన సినిమా ఇదే అని చెప్పాలి. అప్పటి వరకు మోహన్ బాబు కు సరైన హిట్ అంటే ఏంటో తెలియదు. ఈ సినిమా తోనే టాలీవుడ్ లో ఆయనకంటూ ఓ స్పేషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.
ముఖ్యంగా ఈ సినిమా కి భారీ ప్లస్ పాయింట్ రజినీకాంత్ యాక్షన్. ఈ సినిమాలో ఆయన మోహన్ బాబుకు తండ్రి గా నటించారు. ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఈ సినిమా కి రజనికాంత్ రెమ్యూనరేషన్ గా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. అప్పట్లో ఈ సినిమా కోసం మోహన్ బాబు తన ఆస్తులన్ని కుదవ పెట్టడం సంచలనంగా మారింది. ఇక ఈ సినిమాలో మోహన్ బాబుకు జంటగా అందాల తార సౌందర్య..రజనీకాంత్ కు జంటగా నాట్య మయూరి భానుప్రియ నటించారు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను  బాగా అట్రాక్ట్ చేసింది. అందుకే కాబోలు ఈ సినిమా ఆడిన‌న్ని రోజులు  ప్రేక్షకుల‌తో  థియేట‌ర్లన్నీ కిట‌కిట‌లాడాయి.
అయితే నిజానికి ఈ సినిమాను బి గోపాల్ డైరెక్ట్ చేయాల్సి ఉంది. కానీ , అప్పటికే ఆయన దగ్గుబాటి వారసుడు వికటరీ వెంకటేష్.. త్రివిక్రమరావు కాంబినేషన్ లో ఓ సినిమాకి ఫిక్స్ కావడంతో .. ఈ బ్లాక్ బస్టర్ సినిమాఇనా పెదరాయుడు చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఇక అలా ఈ సినిమా రవిరాజా పినిశెట్టి చేతికి రావడం..ఆయన తనదైన స్టైల్లో తెరకెక్కించడం..పెదరాయుడు సినిమా  బ్లాక్ బస్టర్ అవ్వడం చకచకా జరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: