'మహా సముద్రం' హిట్ టార్గెట్ రీచ్ అవుతుందా ?

Vimalatha
టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో యంగ్ హీరోలు శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ 'మహా సముద్రం'. టైటిల్ తోనే ఆసక్తిని పెంచేసిన చిత్రబృందం 'మహా సముద్రం'తో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రానికి వీకెండ్, పండగ తో పాటు మరో కలిసొచ్చే అంశం ఏమిటంటే ఏపీలో థియేటర్లు 100% ఆక్యుపెన్సీ తో ఓపెన్ అయ్యాయి. ఇది వరకు చాలా సినిమాలు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ కోసం ఎదురు చూసి చూసి ఎట్టకేలకు తమ సినిమాలను విడుదల చేశాయి. ఆ సినిమాలకు దొరకని అవకాశం మహా సముద్రం కు మాత్రం దొరికింది. మరి ఈ సదావకాశం సినిమాకు ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి.

ఇక ఆంధ్రలో భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదల కానుంది మహాసముద్రం. దాదాపుగా ఆంధ్రాలో 240 థియేటర్లలో మహా సముద్రం రిలీజ్ అయింది. సీడెడ్ లో 110, నైజాంలో 210 థియేటర్ లలో విడుదల చేశారు. మొత్తంగా 560 థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 750 నుంచి 800 వరకు థియేటర్లలో విడుదలయింది. సినిమా విజయవంతం అవుతుందని చిత్ర బృందం చాలా నమ్మకంగా ఉన్నారు. అనుకున్నట్టుగానే సినిమాకు పాజిటివ్ బజ్ వచ్చింది. మరోవైపు ఈ సినిమా మొదటిరోజు భారీ ఓపెనింగ్స్ కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. కాగా మహాసముద్రం ప్రీ రిలీజ్ బిజినెస్ 13.5 కోట్లకు జరిగింది. ఈ సినిమా లాభాల జోన్లోకి అడుగు పెట్టాలంటే దాదాపు 14 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది. ఎలాగు పండగ కలిసొస్తుంది కాబట్టి మహా సముద్రం ఈజీగానే టార్గెట్ ను చేరుకునే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే సినిమా చూసిన వాళ్ళు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తూ నటీనటుల నటన సినిమాలోని హైలెట్ పాయింట్స్ గురించి చెబుతున్నారు. మరి ఇ ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: