వైట్ డ్రెస్ లో అదరగొడుతున్న మంచు డాటర్..!

Pulgam Srinivas
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సిద్ధార్థ్ హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన అనగనగా ఓ ధీరుడు సినిమాలో ప్రతినాయక పాత్రలో కనిపించి మెప్పించిన మంచు లక్ష్మి, ఆ తర్వాత కూడా అనేక లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి టాలీవుడ్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇలా సినిమాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి ఆ తర్వాత ప్రముఖ టీవీ ఛానల్ లో టెలికాస్ట్ అయిన షో లకు కూడా హోస్ట్ గా వ్యవహరించి బుల్లితెర అభిమానులు కూడా దగ్గర అయ్యింది. ఇటు సినిమాలతో అటు టీవీ షోలతో అనేక మంది ప్రేక్షకులను సంపాదించుకున్న మంచు లక్ష్మి ఆ తర్వాత కాలంలో ఓటిటి లలో వెబ్ సిరీస్ లో కనిపించి కూడా మెప్పించింది.

ఓటిటి లో వెబ్ సిరీస్ లు మాత్రమే కాకుండా ఈ మధ్య కాలంలోనే తెలుగు ప్రముఖ ఓటిటి ఆహా లో ఆహా భోజనంబు అనే వంటలకు సంబంధించిన ప్రోగ్రామ్ కు కూడా హోస్ట్ గా వ్యవహరించి ఎంతో మందిని అలరించింది. ఇలా సినిమాలు, టాక్ షోలు, వెబ్ సిరీస్ లు ఇలా చాలా రకాలుగా ప్రేక్షకులను అలరించిన మంచు లక్ష్మి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉండే మంచు లక్ష్మి అప్పుడప్పుడూ తన అందచందాలతో కూడిన ఫోటోలను కూడా  తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను ఆనందపరుస్తూ ఉంటుంది. అయితే తాజాగా కూడా మంచు లక్ష్మి కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో మంచు లక్ష్మి వైట్ కలర్ డ్రెస్సు లో  బ్లాక్ కలర్ షూస్ ధరించి ఉంది. ప్రస్తుతం మంచు లక్ష్మి కి సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: