రెండు ప్రేమలు ఢీ కొడుతున్నాయి... ?

Satya

ప్రేమ ద్వేషం పోటీ పడితే అది సహజం. గెలిచేది చివరకు ప్రేమ అయినా ఆ సస్పెన్స్ వేరుగా ఉంటుంది. అదే ప్రేమా ప్రేమ ఢీ కొడితే ఆ రిజల్ట్ ఏంటి. ఆ తమాషా ఎలా ఉంటుంది అంటే అది అంచనా వేయడం కంటే వెయిట్ చేసి చూడడమే బెటరేమో.
అవును రెండు ప్రేమలు ఒకే రోజు ఢీ కొడుతున్నాయి. అవే ప్రేమ సందడి, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్. ఈ రెండు సినిమాలకు మంచి టాక్ ఉంది. రెండు కూడా మంచి హైప్ క్రియేట్ చేసినవే. పెళ్ళి సందడి మూవీ నిర్మించిన ప్రముఖ నిర్మాత  అల్లు అరవిందే ఇపుడు అక్కినేని అఖిల్ తో ప్రేమ కధగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ తన బ్యానర్ మీద తీశారు. ఇపుడు ఆయన సినిమాతో పెళ్ళి సందడి పోటీ పడుతోంది.
నాడు పెళ్ళి సందడి తీసిన టాప్ డైరెక్టర్  రాఘవేంద్రరావు ఫస్ట్ టైమ్ స్క్రీన్ మీద నటిస్తూ నాటి పెళ్ళి సందడి హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ తో తీస్తున్న మూవీ ఇది. ఇక హీరోయిన్ శ్రీలీల గ్లామర్ అదుర్స్ అన్నట్లుగా ఉంది. ఈ మూవీ సాంగ్స్ కూడా బాగున్నాయి. కీరవాణి సంగీతానికి బలదూర్ కావాల్సిందే. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ గా ఈ మూవీ ఉండనుంది. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఈ మూవీ వస్తోంది. ఒక విధంగా దసరా ఫెస్టివల్ కి సరైన ఫీస్ట్ అని కూడా అనాలి. లవ్ స్టోరీస్ ని ప్రెజెంట్ చేయడంతో రాఘవేంద్రుడిది అందె వేసిన చేయి.
మరి ఆయనతో పోటీ పడుతున్నాడు బొమ్మరిల్లు భాస్కర్. ఆయన చాలా కాలం తరువాత తనను తాను మళ్లీ ప్రూవ్ చేసుకోవడానికి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచలర్ మూవీ తో వస్తున్నాడు. ఈ మూవీ సాంగ్స్ కూడా హైలెట్ అయ్యాయి. లెహరాయీ  సాంగ్ అయితే  రికార్డులు బద్ధలు కొట్టింది. మరి ఈ మూవీ ద్వారా అఖిల్ గ్యారంటీగా హిట్ కొడతాడు అన్న ధీమా కూడా అందరిలో ఉంది. లక్కీ హీరోయిన్ పూజా హెగ్దే ఈ మూవీలో అఖిల్ కి పెయిర్ గా ఉంది. ఇలా ఈ రెండు ప్రేమ కధలను చూస్తే దేనినీ వంక బెట్టలేని పరిస్థితి ఉంది. మరి ఈ రెండూ హిట్ కావాలనే అంతా కోరుకుంటున్నారు. చూడాలి మరి జనం ఎలాంటి తీర్పు ఇస్తారో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: