చైతూకి పోటీగా సమంత బాలీవుడ్ ఎంట్రీ..

NIKHIL VINAY
పెళ్లి రోజుకి రెండు రోజుల ముందు సమంత నాగ చైతన్య విడిపోతున్నాం అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు రుమార్లుగా ఉన్న ఈ విషయం ఇప్పుడు ఒక్కసారిగా నిజం అయ్యే సరికి సమంత చైతు అభిమానులు ఒక్కసారిగా తీవ్ర నిరాశ చెందారు. ఇక నాగ చైతన్య ఫాన్స్ ఆమె మీద నెగటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ ఇదంతా ఒకవైపు ఇంకొక వైపు నాగ చైతన్య తన సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. అలాగే సమంత కూడా తెలుగు తమిళంలో తక్కువ సినిమాలైన అవే చేస్తూ వస్తుంది.

అయితే ఈమధ్యనే ఆమె నటించిన బాలీవుడ్ ఫామిలీ మాన్ సిరీస్ కి ఎంత పెరు వచ్చిందో అందరికి తెలిసిందే. ఈ సిరీస్ తో ఆమె పేరు దేశమంత తెలిసింది.ఇక ఈ సిరీస్ వల్ల సమంత కి బాలీవుడ్ లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలాగే నాగ చైతన్య కూడా ప్రస్తుతం అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా లో నటిస్తున్నాడు. సమంత కూడా ఇప్పుడు బాలీవుడ్ లోకి చైతు లా అడుగుపెట్టాలి అని అనుకుంటుంది అని టాక్. ఈ మద్యనే ఒక హిందీ దర్శకుడు చెప్పిన కథకి ఆమె ఒకే అన్నారట. త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్సమెంట్ రాబోతుంది.

అలాగే తెలుగు తమిళంలో కూడా సమంత వరసగా సినిమాలు చేయడానికి రెడీ గా ఉందని టాక్. ఇక చైతన్య కూడ తన కెరీర్ లో పీక్ పొజిషన్ లో ఉన్నారు.తెలుగులో వరసగా హిట్స్ కొడుతూ అలాగే హిందీ సినిమాల్లో కూడా అడుగుపెడుతూ ఆయన రేంజ్ పెంచుకుంటున్నారు. నాగ చైతన్య లవ్ స్టొరీ కి థియేటర్స్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ప్రస్తుతం నాగ చైతన్య థాంక్ యు సినిమా షూటింగ్ లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: