ఆదిలోనే విష్ణు కి హంస పాదు ఎదురైందిగా ..... ??

GVK Writings
కలెక్షన్ కింగ్, డైలాగ్స్ అదరగొట్టడంతో దిట్ట అయిన మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు, నిన్న మా అధ్యక్షుడిగా భారీ మెజారిటీ తో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు పోటీగా నిలిచిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మాత్రం ఒకింత ఆవేదన వ్యక్తం చేస్తూ తన మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మీడియా ముందు నిన్న ప్రకటించారు. అలానే ప్రకాష్ రాజ్ ప్యానల్ లో గెలిచిన అభ్యర్థులు కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్లు నేడు ఒక ప్రెస్ మీట్ లో భాగంగా ప్రకటించడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి మొన్నటి ఫలితాల ప్రకారం తమ ప్యానల్ లోని అనసూయ గెలవగా, ఆ రోజు రాత్రి అనంతరం ఆమె ఓడిపోయిందని ఎలక్షన్ అధికారి ప్రకటించడం తమందరినీ విస్మయానికి గురి చేసిందని, అయినా విష్ణు గారి ప్యానల్లో ఆయనకు నచ్చిన వారు ఉండడమే సబబని, అటువంటి వ్యక్తులు అయితే ఆయనతో మరింత సాన్నిహిత్యంగా మెలగడంతో పాటు రాబోయే రోజుల్ మా అసోసియేషన్ ని మరింతగా అభివృద్ధిపథాన ముందుకు తీసుకెళ్లగలరు అనే భావనతోనే తామందరం రాజీనామాలు చేసినట్లు వారు చెప్పుకొచ్చారు.
అయితే విష్ణు మా అధ్యక్షుడిగా ఇంకా పీఠాన్ని ఎక్కక ముందే ఈ విధంగా ఆదిలోనే హంసపాదు అన్న మాదిరిగా ఈ విధంగా ప్రకాష్ రాజ్ ప్యానల్ వారి రాజీనామాలు ఆయనకు ఒకింత తలనొప్పిగా మారాయని, కాగా త్వరలో విష్ణు తన సభ్యులతో కలిసి ఈ విషయమై చర్చించిన అనంతరం ఒక మీడియా మీటింగ్ పెట్టి తదుపరి తమ కార్యాచరణని అందరికీ వెల్లడించనున్నట్లు ఆయన ప్యానల్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. కాగా ఈ గొడవలు ఎప్పుడు సర్దుకుంటాయో, మళ్ళి మా కి పూర్వ వైభవం ఎప్పుడు వస్తుందో ఏమో అంటూ పలువురు సీనియర్ నటులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: