ఆ దర్శకుడి పై సంచలన కామెంట్స్ చేసిన రమ్యకృష్ణ...!

murali krishna
స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణకు ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అభిమానించే అభిమానులు ఉన్నారని అందరకి తెలుసు. బాహుబలి సినిమా తర్వాత రమ్యకృష్ణను అభిమానించే అభిమానుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగిందని తెలుస్తుంది.
అయితే కెరీర్ తొలినాళ్లలో రమ్యకృష్ణ నటించిన పలు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదని సమాచారం. అయితే తనకు స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కడానికి రాఘవేంద్రరావు కారణమని రమ్యకృష్ణ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చినట్లు సమాచారం.
రమ్యకృష్ణ హీరోయిన్ గా రాఘవేంద్రరావు డైరెక్షన్ లో అల్లుడుగారు అనే సినిమా తెరకెక్కిన విషయం అందరికి తెలిసిందే. అల్లుడు గారు సినిమాలో మూగమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించి రమ్యకృష్ణ ప్రేక్షకులను మెప్పించారని సమాచారం. ఆ తర్వాత అల్లరి మొగుడు సినిమాలో మెయిన్ హీరోయిన్ రోల్ లో నటించి ఆ సినిమాతో మరో విజయంను రమ్యకృష్ణ తన ఖాతాలో వేసుకున్నారని తెలుస్తుంది. తర్వాత కాలంలో కూడా రాఘవేంద్ర రావు తన సినిమాల్లో ఛాన్స్ ఇచ్చి రమ్యకృష్ణను ప్రోత్సహించారని తెలుస్తుంది..
అల్లుడుగారు సినిమాకు ముందు పలు సినిమాల్లో రమ్యకృష్ణ నటించగా ఆ సినిమాలు ఫ్లాప్ కావడంతో రమ్యకృష్ణపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడిందని సమాచారం.అల్లరి మొగుడు సినిమా 100 డేస్ ఫంక్షన్ లో రమ్యకృష్ణ మాట్లాడుతూ చాలామంది తనను అదృష్టం లేని ఆర్టిస్ట్ అని చెప్పారని కొన్ని సినిమాల నుంచి తనను తొలగించారని కానీ అల్లరి మొగుడు సినిమాలో అవకాశం రావడం తన అదృష్టమని రమ్యకృష్ణ చెప్పినట్లు సమాచారం.
విజయోత్సవ సభలో రమ్యకృష్ణ ఏడుస్తూ కన్నీళ్లు తుడుచుకున్నారని సమాచారం. ఆ తర్వాత ఒక షోలో రమ్యకృష్ణ మాట్లాడుతూ రాఘవేంద్రరావు సినిమాలలో అవకాశాలు దక్కకపోయి ఉంటే తాను అక్క పాత్రలకు పరిమితం కావాల్సి వచ్చేదని చెప్పారని తెలుస్తుంది. రాఘవేంద్రరావు లేకపోతే సినీ పరిశ్రమకి దూరంగా ఉండాల్సి వచ్చేదని జీవితం మొత్తం రాఘవేంద్ర రావుకు రుణపడి ఉంటానని రమ్యకృష్ణ పేర్కొన్నారని సమాచారం. రమ్యకృష్ణ నటించిన రిపబ్లిక్ ఈ నెల 1వ తేదీన విడుదలై మంచి ఆదరణ పొందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: