విష్ణు ఆ పని చేయకపోతే.... ?

Satya
మంచు విష్ణు. మంచి విష్ణు. ఇండస్ట్రీలో దిగ్గజ నటుడు మోహన్ బాబు కుమారుడిగా వెలుగులోకి వచ్చినా కూడా విష్ణు తనకంటూ ఒక ప్రత్యేకత సాధించారు. చేసిన సినిమాలు తక్కువ అయినా మంచి నటుడు అనిపించుకున్నారు. ఇక విద్యా సంస్థలను చక్కగా చూసుకుంటే మంచి నిర్వాహకుడు అని కూడా పేరు తెచ్చుకున్నారు.
ఇపుడు ఆయన సినిమా నటుల సంఘానికి తన సేవలను అందించాలని మా ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రెసిడెంట్ గా బరిలో నిలబడ్డారు. ఫస్ట్ అటెంప్ట్ తోనే గెలిచారు. మరి విష్ణు ఇచ్చిన హామీలు చూస్తే చాలా భారీవి పెద్దవే అని చెప్పాలి. మాకు బిల్డింగ్ కడతాను అని విష్ణు చెప్పారు. నిజానికి అసోసియేషన్  కాల పరిమితి రెండేళ్ళు. గట్టిగా  ఈ రెండేళ్ళలో పని చేసినా కూడా మా బిల్డింగ్ తయారవుతుందా అంటే సందేహమే అని చెప్పాలి.
ఎందుకంటే ముందు స్థలం చూడాలి. ఆ మీదట రేటు పెట్టి కొనాలి. ఒకవేళ ప్రభుత్వం స్థలం ఇచ్చినా కూడా బిల్డింగ్ కట్టడం అంటే కట్ల వ్యవహారమే. మరి ఆ పని తన సొంత నిధులతో చేస్తాను అని విష్ణు చెప్పారు. అయితే ఈ విషయంలో ఆయనకు బాలయ్య కూడా మద్దతు ఇస్తానని అప్పట్లో చెప్పారు. ఇలా పెద్ద నటులు అంతా సహకరిస్తే మా బిల్డింగ్ తయారు కావచ్చు. అది కూడా యుద్ధ ప్రాతిపదికగా తయారు చేయాలి.
ఇక మోహన్ బాబు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే అనేక సంక్షేమ పధకాలు కూడా మా మెంబర్స్ కి ఇస్తామని చెప్పారు. మొత్తానికి విష్ణు భారీ హామీలే అన్నీ ఇచ్చారు. మరి వాటిని నెరవేర్చుకోవడానికి ఆయన ఈ రెండేళ్ళు అహర్నిశలూ కూడా కష్టపడాలి. ఏదేమైనా తేడా కొట్టినా ఎక్కడ లేటు అయినా లోటు ఉన్నా కూడా అడిగేందుకు, కడిగేందుకు ప్రకాష్ రాజ్ ప్యానల్ రెడీగా ఉంది మరి. మొత్తానికి చూస్తే ఇదంతా చాలా పెద్ద సవాల్ గానే ఉంది. మరి విష్ణు ఎలా దీన్ని ఎదుర్కొంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

maa

సంబంధిత వార్తలు: