కన్ఫ్యూజన్ లో కాజల్ అభిమానులు !?

Vimalatha
సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె త్వరలో తల్లి కాబోతోంది అంటూ వార్తలు ప్రచారం అవుతున్నాయి. కాజల్ తన స్నేహితుడు గౌతమ్ కిచ్లును గత ఏడాది సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత కూడా ఈ ముద్దుగుమ్మ వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాస్తవానికి ఇప్పుడు ఆమె చేస్తున్న సినిమాలన్నీ పెళ్ళికి ముందు ఒప్పుకున్నవే. అదలా ఉంచితే ఇప్పుడు పలు భారీ చిత్రాలు చేతిలో ఉండగానే కాజల్ తల్లి కాబోతోందంటూ వార్తలు బయలుదేరాయి. ఆ రూమర్స్ ఫై ఆమె స్పందించకపోవడంతో అభిమానులు కూడా అది నిజమేనని ఫిక్స్ అయ్యారు. అయినప్పటికీ కాజల్ ఈ వార్తలను అస్సలు ఖండించలేదు. తల్లి కావడం వల్లనే నాగార్జున రాబోయే చిత్రం "ది ఘోస్ట్" నుండి తప్పుకుందని కూడా వార్తలు వచ్చాయి.
కాజల్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె 19+ మిలియన్ ఫాలోవర్స్ బేస్‌ని కలిగి ఉంది. దీంతో అక్కడ శుభవార్తను పంచుకుంటుందని చాలా మంది ఊహించినప్పటికీ వారికి కూడా నిరాశే ఎదురయ్యింది. అయితే తాజాగా కాజల్ అభిమానులు కన్ఫ్యూజన్ లో పడిపోయారు. దానికి కారణం కాజల్ లేటెస్ట్ ఫోటోషూట్లు. కాజల్ ఇటీవల ఓ మ్యాగజైన్ కోసం పోజులిచ్చిన కొన్ని హాటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. ఎప్పటిలాగే ఆమె ఆ చిత్రాలలో సెడక్టివ్ అప్పీల్‌ను చూపించడం గమనార్హం. తల్లి కాబోతుందంటూ ఒకవైపు వార్తలు జోరందుకుంటుంటే, మరోవైపు కాజల్ ఇలాంటి హాట్ ఫోటోలు షేర్ చేయడం వెనుక అర్థం ఏమిటో ఆమె అభిమానులకు అసలు అంతుపట్టడం లేదు. ఆ వార్తలు అన్నీ ఒట్టివేనని ఈ ఫొటోలతో చెప్పింది అని కొంతమంది అంటుండగా, తల్లి అయ్యాక సమయం పడుతుంది కాబట్టి ఇప్పుడే కాస్త గ్లామర్ ఒలకబోస్తోంది అని మరికొంత మంది అంటున్నారు. ఏదేమైనా ఆమె ఈ విషయంపై క్లారిటీ ఇస్తేనే ఈ కన్ఫ్యూజన్ తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: