పవన్ కోసం స్టోరీ రెడీ చేస్తున్న మహేష్ డైరెక్టర్ .... ??

GVK Writings
కళ్యాణ్ రామ్ నందమూరి హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన పటాస్ మూవీ ద్వారా టాలీవుడ్ కి దర్శకుడిగా తొలిసారిగా పరిచయయ్యారు అనిల్ రావిపూడి. అంతకముందు పలు సినిమాలకు కథా విభాగంలో పని చేసి మంచి అనుభవం సంపాదించిన అనిల్, ఫస్ట్ సినిమా ద్వారా సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఆ తరువాత సాయి ధరమ్ తేజ్ తో సుప్రీం, అలానే రవితేజ తో రాజా ది గ్రేట్, వెంకటేష్ వరుణ్ తేజ్ లతో ఎఫ్ తో పాటు గత సంవత్సరం సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు వంటి వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు తీస్తూ వస్తున్నారు అనిల్ రావిపూడి.
ఇక ప్రస్తుతం ఎఫ్ 2 కి సీక్వెల్ గా ఆయన తీస్తున్న సినిమా ఎఫ్ 3. వెంకటేష్, వరుణ్ మరొకసారి హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బాలయ్య కోసం ఒక స్టోరీ తో పాటు సూపర్ స్టార్ మహేష్ కోసం మరొక స్టోరీ సిద్ధం చేసుకుని త్వరలో వారికి వినిపించేందుకు సిద్ధం అవుతున్న అనిల్ రావిపూడి, అటు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం కూడా ఒక పవర్ఫుల్ కథ సిద్ధం చేస్తున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం.
ఇప్పటికే రెండు సార్లు పవన్ ని సినిమా విషయమై కలిసిన అనిల్, ఆయనతో మూవీ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారని, అందుకే మహేష్, బాలయ్య మూవీ ల స్టోరీల తో పాటు పవన్ మూవీ స్టోరీని కూడా వేగవంతంగా తన బృదంతో కలిసి ప్రస్తుతం పూర్తి చేసే పనిలో ఉన్న అనిల్, వీలైనంత త్వరలో దానిని ఫినిష్ చేసి పవర్ స్టార్ కి వినిపించేలా రెడీ అవుతున్నారట. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ మూవీని దిల్ రాజు నిర్మించే ఛాన్స్ ఉందని సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ కనుక నిజం అయితే త్వరలో పవర్ స్టార్ తో అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మంచి యాక్షన్ తో కూడిన ఎంటర్టైనర్ మూవీ ని చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: