పూజా హెగ్డే ఆ హీరో కి మధ్య విబేధాలు నిజమేనా!!

P.Nishanth Kumar
సినిమా పరిశ్రమలో ఏ ఇద్దరికైనా అప్పుడో ఇప్పుడో విభేదాలు రావడం, మనస్పర్ధలు రావడం సహజమే. ఇద్దరు హీరోల మధ్య కానీ, ఇతర దర్శకుల మధ్య కానీ ఇద్దరు నిర్మాతల మధ్య కానీ హీరో దర్శకుల నిర్మాతల మధ్య కానీ ఈ విభేదాలు వస్తూ ఉంటాయి. కానీ హీరోయిన్ హీరో ల మధ్య విభేదాలు రావడం చాలా తక్కువగా చూస్తూ ఉంటాము. ఎందుకంటే హీరోయిన్లకు అవకాశాలు రావాలన్నా వారు స్టార్ హీరోయిన్ గా ఎదగాలని హీరోలు దర్శకులు నిర్మాతలు చెప్పినట్లు వినాల్సిందే.

లేకపోతే వారికి కెరియర్ ఉండదు అనే విషయం వారికి కూడా తెలుసు. అందుకే హీరోయిన్ లు ఎప్పుడూ కూడా ఇలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటారు. కానీ ఇటీవల టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగిన పూజాహెగ్డే కు మాత్రం ఓ హీరో తో విబేధాలు వచ్చాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఆయన ఎవరో కాదు.. పాన్ ఇండియా హీరోగా దేశంలోనే నెంబర్ వన్ హీరోగా ఎదుగుతున్న ప్రభాస్ తో ఆమెకు విబేధాలు వచ్చాయట. వీరిద్దరూ కలిసి ప్రస్తుతం రాధే శ్యామ్ అనే సినిమా చేస్తుండగా సినిమా సెట్ లో పూజ తీరు ఏమాత్రం బాగోలేదని టాప్ హీరోయిన్ అన్న ఈగో తో రోజూ లేటుగా రావడమే కాకుండా సరిగ్గా షూటింగ్ చేయడం లేదట.

దాంతో ప్రభాస్ ఆమె తీరుతో ఎంతో కూల్ గా ఉండే తనే విసిగిపోయారని దాంతోనే వీరిద్దరి మధ్య సినిమా లో కెమిస్ట్రీ బాగా పండ లేదని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై రాధే శ్యామ్ చిత్ర బృందం స్పందించింది. వీరిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని పూజ సమయస్ఫూర్తితో పాటు టాలెంట్ ఉన్న హీరోయిన్ అని ఆమెతో పని చేయడం అందరికీ చాలా కంఫర్ట్ గా ఉందని చెప్పారు. దీంతో వీరిద్దరి మధ్య అపోహలు ఉన్నాయి అని వార్తల పై క్లారిటీ వచ్చినట్లు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: